Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ 13 జూలై 1992న ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగూడెంలో జన్మించింది. నాగార్జున, సుమంత్ కలిసి నటించిన సినిమా స్నేహమంటే ఇదేరా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ గంగోత్రిలో చిన్న పాత్రలో అద్భుతంగా నటించి మంచి మార్కులు వేపించుకుంది. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఠాగూర్ లో మెగాస్టార్ తో నటించే అవకాశం కొట్టేసింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన అడవి రాముడులో ఆర్తి అగర్వాల్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని పాండురంగడు, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, ఉల్లాసంగా ఉత్సహంగా వంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.
Also Read: Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతిపై రంజని ఫైర్!
కట్ చేస్తే, 2022లో మసూదాతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ చిత్రం చిన్నగా మూవీగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. తొలిసారి హీరోయిన్ గా ఈ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. 2023లో బలగం, ఉస్తాద్ మూవీస్ లో కథానాయకిగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ తేనె కళ్ళ సుందరి నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడంతో క్రేజ్ పెరిగింది. ఇక సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలు చూసి కుర్రాళ్లు నెట్టింట లైక్స్ , షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: కాలుష్య రహిత నగరాలతో.. పర్యావరణ పునరుజ్జీవనం.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ ఫోటోలపై రియాక్ట్ అయిన నెటిజెన్స్ లో కొందరు మీ అందంతో మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు, శారీలో ఎంత ముద్దుగున్నావ్ బేబీ, నిన్ను చీరలో చూస్తుంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి మీకు లాగే ఉంటే బావుండు వెంటనే పెళ్లికి ఒకే చెబుతా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు ” మంచి నాటు కోడి పెట్టలా ఉన్నావ్ ” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు