Balakrishna
ఎంటర్‌టైన్మెంట్

Balakrishna: ఫ్యాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

Balakrishna: సినిమా ఇండస్ట్రీ అనే కాదు కానీ, జనరల్‌గా కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఏదైనా ఒక పని చేయడానికి టైమ్ ఫిక్స్ చేసుకుంటే ఆ టైమ్‌కి అది కరెక్ట్‌గా జరగాలని కొందరు భావిస్తుంటారు. మరికొందరు ప్రతీది శాస్త్రీయంగా చేయాలని చూస్తారు. అలా ఎవరికి ఉండే సెంటిమెంట్స్ వారికి ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన మూవీ ఓపెనింగ్‌కు తను హాజరైతే ఆ సినిమా సక్సెస్ కాదనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్స్ రోజు కనిపించరు. ఇలాంటి సెంటిమెంట్స్‌లో బాలయ్యని కొట్టే వారే లేరంటే అసలు అతిశయోక్తి కానే కాదు.

Also Read- Jaat: అందుకే ఆ సన్నివేశాన్ని తొలగించామని వివరణ ఇచ్చిన దర్శకుడు

బాలయ్యకు ప్రతీది ముహూర్తం ప్రకారం జరగాలి. ఒక్క సెకను అటు, ఇటు కూడా కాకూడదు. అంత పర్ఫెక్ట్‌గా ఆయన సెంటిమెంట్‌ని ఫాలో అవుతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలయ్యకు ఉన్నమరో సెంటిమెంట్ కూడా రివీలైంది. అదే 0001 సెంటిమెంట్ అర్థం కాలేదా? ఫ్యాన్సీ నెంబర్ త్రిబుల్ జీరో వన్ సెంటిమెంట్ కోసం బాలయ్య ఎంతైనా ఖర్చు పెడతారు. ఆ విషయంపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి కూడా. గతంలో ఓసారి బాలయ్య ఇలా ఫ్యాన్సీ నెంబర్ కోసం దాదాపు 7 లక్షల 70 వేల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి TG09 F0001 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం బాలయ్య భారీగా ఖర్చు పెట్టారు. ఈ నెంబర్ కోసం బాలయ్య 7 లక్షల 75 వేల రూపాయలను ఖర్చు పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారికి కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్ల సెంటిమెంట్ ఉంది. తారక్‌ అయితే తన ట్విట్టర్ ఎక్స్‌కు 9999 వచ్చేలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ఎవరికి ఉండే సెంటిమెంట్స్ వారికి ఉంటాయి. ఇక విషయంలోకి వస్తే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో ఫ్యాన్సీ నెంబర్స్ వేలం జరిగింది. ఈ వేలంలో ఆర్టీవో ఆఫీస్‌‌కు దాదాపు రూ. 37 లక్షల ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. శుక్రవారం ఈ ఫ్యాన్సీ నెంబర్స్ వేలం జరిగింది. ఈ బిడ్డింగ్‌లో వేలానికి పెట్టిన నెంబర్స్ అన్నీ కూడా రూ. 50 వేలకి పైగానే రేటు పలకడం విశేషం. మొత్తంగా అయితే బాలకృష్ణ రూపంలో ఆర్టీవో ఫ్యాన్సీ నెంబర్స్ వేలం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read- Manchu Vishnu: సడెన్‌గా నార్త్‌పై ఇంత ప్రేమ కురిపిస్తున్నాడేంటి?

ఖైరతాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్స్ వేలంలో వివరాలిలా ఉన్నాయి. మొత్తం బిడ్ విలువ రూ. 37,15, 645. ఈ బిడ్‌లో ఫ్యాన్స్ నెంబర్స్ పొందిన వారి వివరాలివే.

1. ఫ్యాన్సీ నెంబర్ – TG 09 F0001
యజమాని పేరు: నందమూరి బాలకృష్ణ
మొత్తం బిడ్ అమౌంట్: రూ. 775,000

2. ఫ్యాన్సీ నెంబర్ – TG 09 F 0009
యజమాని పేరు: కమలయ్య్ హైసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్
మొత్తం బిడ్ అమౌంట్: రూ. 670,000

3. ఫ్యాన్సీ నెంబర్- TG 09 F 0099
యజమాని పేరు: కాన్‌క్యాప్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్
మొత్తం బిడ్ అమౌంట్: రూ.475,999

4. ఫ్యాన్సీ నెంబర్- TG 09 F 0005
యజమాని పేరు: జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
మొత్తం బిడ్ అమౌంట్: రూ. 149,999

5. ఫ్యాన్సీ నెంబర్- TG 09 F 0007
యజమాని పేరు: కె.శ్రీనివాస్ నాయుడు
మొత్తం బిడ్ అమౌంట్:- రూ.137,779

6. ఫ్యాన్సీ నెంబర్- TG 09 E 9999
యజమాని పేరు: ఎకో డిజైన్ స్టూడియో
మొత్తం బిడ్ అమౌంట్ – రూ.99,999

7. ఫ్యాన్సీ నెంబర్- TG 09 F 0019
యజమాని పేరు : నేత్రావతి బ్బు బాలగప్ప శివాలింగప్ప
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 60,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?