Dear Uma: సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ (Suma Chitra Arts) పై తెలుగమ్మాయ్ సుమయ రెడ్డి (Sumaya Reddy) రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రథన్ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటూ సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయాన్ని తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు అంకితం ఇస్తున్నట్లుగా హీరోయిన్, నిర్మాత సుమయరెడ్డి తెలిపారు.
Also Read- Jaat: అందుకే ఆ సన్నివేశాన్ని తొలగించామని వివరణ ఇచ్చిన దర్శకుడు
ఈ కార్యక్రమంలో సుమయ రెడ్డి మాట్లాడుతూ.. మా చిత్రానికి మీడియా మొదటి నుంచి ఎంతగానో సపోర్ట్ చేసింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. ఈ చిత్ర సక్సెస్‌తో అవన్నీ మరిచిపోయాం. ప్రస్తుతం ఎన్నో సినిమాలు పూర్తయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. కానీ మేము ఈ సినిమాను చెప్పిన టైమ్‌కి సక్సెస్ ఫుల్‌గా రిలీజ్ చేశాం. అదే నాకు పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నాను. విడుదలైన అన్ని చోట్ల మా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహిళలందరికీ అంకితం చేస్తున్నాను.
మా అమ్మ, తమ్ముడు, మా టీమ్ సహకారం వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. రథన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. హాస్పిటల్‌లోనే మన జీవితం మొదలవుతుంది, అక్కడే మన జీవితం ముగుస్తుంది. ఇలాంటి ఓ మంచి సబ్జెక్ట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంత బాగా ప్రేక్షకులు ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు. ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంది. అది అందరికీ చేరాలి. ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మా సినిమాను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్ అని చెప్పుకొచ్చారు.
Also Read- Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి మొదలెట్టిందిరా మళ్లీ.. పాటతో రెచ్చిపోయిందిగా.. వీడియో వైరల్
దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు. మీడియా, మౌత్ టాక్ వల్లే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే రోజులివి. మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియాకు, మంచి రివ్యూలు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా మీడియాకు, ఆడియెన్స్‌కు, చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ‘సుమయ రెడ్డి ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala).
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు