Jaat: రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘జాట్’ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌కు చెందిన మరో దర్శకుడు బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని, కలెక్షన్ల పరంగానూ నిర్మాణ సంస్థకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అందుకే, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జాట్ 2’ని కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా కనిపించే సీన్ ఒకటి కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. ఈ సీన్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ సన్నివేశం తొలగించాలని డిమాండ్ చేస్తూ కేసులు కూడా పెట్టారు.
Also Read- Manchu Vishnu: సడెన్‌గా నార్త్‌పై ఇంత ప్రేమ కురిపిస్తున్నాడేంటి?
ఈ కాంట్రవర్సీపై నిర్మాతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు క్షమాపణలు కోరుతున్నారు. ఆ అభ్యంతరకరమైన సన్నివేశాన్ని వెంటనే తొలగిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు చిత్ర దర్శకుడు కూడా ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కూడా, ఆ సన్నివేశం గురించి వివరిస్తూ.. ఎవరినీ ఉద్దేశించి తీసిన సీన్ కాదని వివరణ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘జాట్ 2’ సినిమా ట్రైలర్ కట్‌లోనూ ఇప్పుడు అభ్యంతరకరమైన సీన్ అని చెప్పుకుంటున్న సీన్ ఉంది. ఆ సీన్‌పై సెన్సార్ బోర్డ్ వారు కూడా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆ సీన్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేయాలని మాత్రమే సూచించారు. విడుదలకు ముందే ఆ సన్నివేశాన్ని బ్లర్ చేశాం. అందరూ చూస్తేనే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అలాంటి బ్లాక్‌బస్టర్ స్పందనను అందుకున్న ఈ సినిమా విషయంలో, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని ఏ దర్శకనిర్మాత అనుకోరు. మేము ప్రేక్షకుల కోసమే సినిమాలు తీస్తాం. వారికి అభ్యంతరం అని అనిపిస్తే కచ్చితంగా ఆ సన్నివేశాన్ని తొలగించాలి. అందుకే ఏ సీన్‌పై అయితే అభ్యంతరాలు వచ్చాయో, ఆ సీన్‌ని వెంటనే తొలగించామని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.
Also Read- Actor: ఫోన్ అంటేనే భయపడుతున్న నటుడు.. తెగ ఫీలయ్యారు!
ప్రస్తుతం గోపీచంద్ మలినేని పేరు బాలీవుడ్‌లో బీభత్సంగా వినిపిస్తోంది. ‘జాట్’ మూవీ ఊహించని సక్సెస్ అందుకోవడంతో, పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని మాత్రం మరోసారి తన అభిమాన హీరో నందమూరి నటసింహం బాలయ్య (Natasimham Nandamuri Balakrishna) తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘జాట్ 2’ (Jaat 2)తో పాటు బాలయ్యతో సినిమా చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో బాలయ్య ‘అఖండ 2’ (Akhanda2) చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ఘన విజయాన్ని అందుకుని సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. మరోసారి ఈ కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు