Subbareddy on Vijayasai Reddy (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Subbareddy on Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్.. గట్టిగా ఇచ్చి పడేశారుగా!

Subbareddy on Vijayasai Reddy: ఏపీలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. వైకాపాలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ప్రముఖంగా అతడి పేరు వినిపించేది. అయితే అనూహ్యాంగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి.. పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం లిక్కర్ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మరోమారు వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై స్పందించిన ఆ పార్టీ కీలకనేత వైవీ సుబ్బారావు.. విజయసాయిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆ విషయం తెలియదా!
వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయినట్లు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీనిని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో నెంబర్ స్థానం ఎప్పుడులేదని.. భవిష్యత్తులోనూ అది రాబోదని తేల్చి చెప్పారు. వైసీపీలో 1 నుంచి 100 వరకూ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డేనని తేల్చిచెప్పారు. ఈ విషయం విజయసాయిరెడ్డి తెలియదా అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందో తేలదో ఆయన తెలియదా అంటు నిలదీశారు. మరోవైపు తమ హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదని.. దానిని కోర్టు ద్వారా నిరూపించుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Hydra demolition: ఏపీని తాకిన హైడ్రా ప్రకంపనలు.. టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో కూల్చివేతలు..

సాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే!
శుక్రవారం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గురించి జగన్ ను తప్పుదారి పట్టించారని సాయిరెడ్డి అన్నారు. దాని వల్ల రెండో స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయాయని చెప్పారు. జగన్ మనసుతో తనకు స్థానం లేదని తెలిశాకే బయటకు వచ్చినట్లు స్ఫష్టం చేశారు. అయినప్పటికీ తనపైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?