Samantha( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: స్పీడ్ పెంచిన సామ్.. పక్కా ప్లాన్ తో రెడీ అయిన సమంత

Samantha: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల బ్యూటీ సమంత.. ఇప్పుడు, తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ” శుభం ” మూవీ టీమ్ సభ్యులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపీ విరామ దర్శన సమయంలో మూవీ నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తో పాటు హీరోలు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర హీరోయిన్లు శాలిని, శ్రీయ, శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Also Read:  Vardhannapet News: ధాన్యం కొనుగోలులో మోసపోకండి.. ప్రభుత్వ ఐకెపి కేంద్రాల్లోనే అమ్మాలని సూచన…

స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత, రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించి, చిత్ర బృందానికి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరిచారు.

ఆలయ దర్శనం అనంతరం, మూవీ టీమ్ మీడియాతో మాట్లాడుతూ ” వచ్చే నెల అనగా మే 9 న శుభం మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వనుందని తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని తెలిపారు. దీనిలో హర్రర్ తో పాటు ఫుల్ లెన్త్ కామెడీ కూడా ఉంటుందని వెల్లడించారు.

Also Read: Atma Committee: ఆత్మ కమిటీకి కొత్త ఆశ.. రైతులకు లాభకరమైన పద్ధతులు.. ఆరోగ్యశాఖ మంత్రి!

ఫ్యామిలీ అంతా కలిసి చూసే మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలిపారు. చాలా రోజుల తర్వాత జంధ్యాల కామెడీ తలపించేలా భార్య భర్తల మధ్య జరిగే సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయని తెలిపారు.

శ్రీవారి దర్శించుకున్న డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయదు లోహార్

తిరుమల శ్రీవారిని వారిని డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయదు లోహార్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఈ ముద్దుగుమ్మ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత, రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు