Tollywood Actor: తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరో.. పోస్ట్ వైరల్
Tollywood Actor ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Tollywood Actor: తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరో.. పోస్ట్ వైరల్

Tollywood Actor: యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో సుహాస్ కూడా ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా తన సినీ కెరియర్లో ఎక్కువ హిట్స్ పడ్డాయి

షార్ట్ ఫిలిమ్స్ తో తన టాలెంట్ ను నిరూపించుకున్న సుహాస్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. కలర్ ఫోటో చిత్రంతో కరోనా సమయంలో పెద్ద విజయం సాధించి, ఆ మూవీకి నేషనల్ అవార్డు రావడంతో యువ హీరో స్టార్ గుర్తింపును పొందాడు. ఆ తర్వాత హీరోగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు, ప్రసన్న వదనం.. మూవీస్ తో హిట్స్ కొట్టాడు. హీరోగానే కాకుండా హిట్ 2 చిత్రంలో విలన్ పాత్రలో కూడా అద్భుతంగ నటించాడు.

Also Read:  Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?

ప్రస్తుతం, యంగ్ హీరో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ వైపు వెబ్ సిరీస్ లు, ఇంకో వైపు హీరోగా కూడా వరుస మూవీస్ చేస్తున్నాడు. త్వరలోనే ” ఓ భామ అయ్యో రామ ” మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా, సుహాస్ తమిళ్ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

Also Read:  Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?

తమిళ్ స్టార్ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ” మందాడి ” మూవీలో సుహాస్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు పలు హిట్స్ తో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, విజయ్ సేతుపతితో ఓ ఇంటర్వ్యూ చేసి తమిళ్ యాక్టర్స్ కు దగ్గరయ్యాడు. ఇక, ఇప్పుడుమూవీతో మరింత చేరువయ్యి తమిళ్ లో కూడా వరుస చిత్రాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క