Mad Square OTT: చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా కామెడీ ప్రధానంగా ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత యాక్షన్ ఉన్నా, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో సినిమాలను చూస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరోసారి ఇది నిజమే అని నిరూపించుకుంది. అలాగే ‘మ్యాడ్’ (MAD)కి సీక్వెల్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా రీసెంట్‌గా విడుదలై, సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు చిత్రాలను గమనిస్తే.. కామెడీనే ఈ సినిమాలకు ఉన్న ప్రధాన బలం. ప్రేక్షకులు ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టడానికి కారణం కూడా అదే. ఇక ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కన్ఫ్యూజన్ తర్వాత ఒకేసారి టీవీ, ఓటీటీలో ప్రీమియర్‌గా వచ్చి మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ వంతు వచ్చింది.
Also Read- Urvashi Rautela: సౌత్‌లో నాకు గుడి కట్టాలి.. డౌటే లేదు ఇది అదే!
సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, సంగీత సంచలనం థమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించి అఖండ విజయాన్ని అందుకుంది. దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ అంతే ఆదరణను రాబట్టుకుంటుందనడంలో అసలు సందేహమే అవసరం లేదు. ఎందుకంటే, ఈ సినిమాకున్న బలం కామెడీ. ఇప్పుడు వేసవి సెలవులు. పిల్లలందరూ ఇళ్లలోనే ఉంటారు. ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారు కాబట్టి.. కచ్చితంగా ఓటీటీలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అయితే ఓటీటీ విడుదల ఎప్పుడనే దానిపై మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.
Also Read- OTT Movies: ఏప్రియల్ 24న ‘లూసిఫర్ 2’నే కాదు.. ఆ స్టార్ హీరో సినిమా కూడా!
‘మ్యాడ్ స్వ్కేర్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ (Mad Square OTT Streaming Date) ఇదేనంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర ఓటీటీ హక్కులు ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 25న ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని అంటున్నారు. అయితే మేకర్స్ కానీ, ఓటీటీ సంస్థగానీ అధికారికంగా మాత్రం డేట్ ప్రకటించలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కచ్చితంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ఆ తేదీనే వస్తుందని అంతా ఫిక్సవుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు