Saanvi Meghana : శాన్వి మేఘన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైరా నరసింహ రెడ్డి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పిట్ట కథలు, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రేమ విమానం, కుటుంబస్తాన్, టుక్ టుక్ వంటి చిత్రాలతో అలరించింది. ఆమె తన నటనా నైపుణ్యంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ, యువ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంలోనూ తగ్గేదేలే అంటూ ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
శాన్వి మేఘన 1998 సెప్టెంబరు 12న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తన చదువును బాల్డ్విన్ గర్ల్స్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ ను పూర్తి చేసింది.
Also Read: Tirumala News: తిరుమలలో ఇద్దరు పిల్లలను కాపాడిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
చదువుకుంటున్న సమయంలో సినిమాల్లో అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. క్యాంపస్‌లో జరిగే మూవీస్ షూటింగ్స్ చేయడం వలన నటనపై ఇష్టాన్ని పెంచుకుంది. ఒక సీరియల్ ఆడిషన్ ద్వారా ఆమె నటనా రంగంలోకి ప్రవేశించింది. ఈ ముద్దుగుమ్మ తన సినీ ప్రస్థానాన్ని 2019లో రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో మొదలు పెట్టింది.
Also Read: Naa Anveshana On Aghori: అఘోరీని చీల్చి చెండాడిన నా అన్వేష్.. ఇది మామూలు రోస్టింగ్ కాదు భయ్యా!
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా, జిమ్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం, ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, పొట్టి బట్టలతో కనిపించిన శాన్విని చూసిన నెటిజన్స్ ” సూపర్ గా ఉన్నారంటూ ” అంటూ ఫ్యాన్స్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు