AP Tourist Places ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Tourist Places: ఛలో ఏపీ.. వీటిని చూసేద్దాం..

AP Tourist Places: సమ్మర్ హాలీడేస్ రానున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమ్మర్ ట్రిప్స్ కు ప్లాన్ చేస్తారు. కానీ సామాన్య ప్రజానీకం తమ ఆర్థిక స్థోమతను బట్టి టూర్స్ ప్లాన్ చేస్తారు. అటువంటి వారు సమ్మర్ ట్రిప్స్ కు దూరమయ్యామనే ఫీలింగ్ రాకుండా, మన ఏపీలో ఎన్నో ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి చుట్టేస్తే, సమ్మర్ ట్రిప్ హ్యాపీగా, ఎంజాయ్ గా సాగినట్లే.

పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ టూరిస్ట్ ప్రదేశాలను చూసేందుకు దూర ప్రాంతాల టూరిస్టులు ఆసక్తి చూపుతుంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి చోటుకు ఒకసారి వెళితే మళ్లీ మళ్లీ వెళ్ళాలనిపించే ప్లేసెస్ కూడా ఉన్నాయి.

ఏపీలో ఎన్నో టూరిస్ట్ ప్రదేశాలున్నాయి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి టూరిస్టులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఎందుకంటే, ఇక్కడి ఉండే ప్రకృతి మనసుకి హాయినిస్తుంది. భూమిపై ప్రకృతి అన్ని చోట్లా ఓకే మాదిరి ఉండదు. కొన్ని సౌందర్యంగా ఉంటుంది. మరి కొన్ని చోట్ల నిశబ్దంగా ఉంటుంది. ఏపీలో పర్వత ప్రాంతాలు, సముద్ర తీరాలు, నదులు లాంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, పర్యాటకులు ఏదొక కొత్త ప్లేస్ కి ప్లాన్ చేసుకుంటారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మరి, ఏపీలో ఎక్కువ ఆకర్షించే ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

విశాఖపట్టణం

విశాఖపట్టణాన్ని వైజాగ్ కూడా అని కూడా పిలుస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద తీర ప్రాంత పోర్ట్ నగరంగా విశాఖకు మంచి గుర్తింపు ఉంది. ఏపీ పర్యాటకంలో అత్యంత సుందరమైన ప్రదేశాలలో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. కైలాస గిరి, రామ కృష్ట బీచ్ , ఋషి కొండ బీచ్, భీమిలి, హుడా పార్క్, విశాఖ మ్యూజియం వంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి.

శ్రీశైలం

భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూల్ జిల్లాలో ఉంది. ఏపీ లోని ప్రజలు అత్యధికంగా గుడిని సందర్శిస్తారు. హైద్రాబాద్ నుంచి వీకెండ్స్ లో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అష్ట దశ పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికదేవి సమేతంగా శ్రీశైలం మల్లన్న ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ శ్రీశైలం డ్యామ్, ఇష్ట కామేశ్వర దర్శనం, శిఖరం, అటకేశ్వరం, సాక్షి గణపతి, పాలధార పంచదార వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

తిరుమల

భారతదేశంలో తిరుమల చాలా ముఖ్యమైన పవిత్రమైన ప్రదేశం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందినదిగా చెబుతుంటారు. పవిత్ర వెంకటేశ్వరస్వామి ఆలయం తూర్పు కనుమలలోని శేషాచలం శ్రేణిలోని వెంకటాద్రి శిఖరంపై ఉంది. విష్ణువు యొక్క అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన వెంకటేశ్వర ఆలయం ఉన్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. దీనిని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తుంటారు.

విజయవాడ 

విజయవాడ అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది  కనకదుర్గ టెంపుల్. ఈ సమ్మర్ లో  బెజవాడ వెళ్ళి మీ ట్రిప్ ను మరింత ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!