Single Song: ‘డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు, కామెడీ వెనుమా కామెడీ ఇరుక్కు’ అంటూ ఆ మధ్య దిల్ రాజు (Dil Raju) ఓ స్టేజ్‌పై మాట్లాడిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఆ మాటలతో ఓ పాట కూడా ఇటీవల వచ్చింది. అప్పుడు దిల్ రాజు మాట్లాడిన మాటలు, ఇప్పుడు కూడా ఏదో రకంగా ఎవరో ఒకరు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు. ఆ మాటలపై ఎవరెన్ని చేసుకున్నా, దిల్ రాజు చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఆయన కూడా మళ్లీ మళ్లీ ఆ మాటలు అవసరమైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక దిల్ రాజు సంగతి ఇలా ఉంటే, ఇప్పుడు అల్లు అరవింద్‌ని అలా స్ఫూర్తిగా తీసుకున్నారు ‘సింగిల్’ మూవీ టీమ్.
Also Read- Jeevitha Rajashekar: జీవితా రాజశేఖర్‌కు ఊహించని బాధ్యత.. ఇది ఎవ్వరూ ఊహించలే!
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీత సారధ్యంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకోగా, తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ గ్రూవ్ టు ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్‌ను విడుదల చేశారు. ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’ అంటూ ‘ఫ్రస్ట్రేషన్ యాంథెమ్’గా వచ్చిన ఈ పాట ఒంటరి జీవితాన్ని ఒక వేడుకలా చూపిస్తుంది.
అయితే ఈ పాటలో శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వేసిన స్టెప్స్ మాత్రం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి. ఎందుకలా అనుకుంటున్నారా? ఈ పాటలో వారిద్దరూ వేసిన ఓ స్టెప్ సేమ్ టు సేమ్ అల్లు అరవింద్ వేసిన స్టెప్‌ని తలపిస్తున్నాయి. ఇటీవల నాగ చైతన్య, సాయిపల్లవి కాంబోనేషన్‌లో అల్లు అరవింద్ నిర్మించిన ‘తండేల్’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎక్కడా చూసినా అల్లు అరవింద్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సాయిపల్లవితో కలిసి ఆయన వేసిన స్టెప్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆ స్టెప్‌ని స్ఫూర్తిగా తీసుకుని సింగిల్‌లో ప్రయోగించారు. ఇక ఈ స్టెప్‌ని చూసిన వారంతా గుర్తు పట్టి.. ఈ స్టెప్‌కు అల్లు అరవింద్ ఇన్సిపిరేషన్ కదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశారో.. ఇక అంతే!
ఇక ఈ పాటలో సరదా సాహిత్యం, ఆకట్టుకునే మాస్ అప్పీల్ పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యం అందించారు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి ఒంటరితనాన్ని హ్యుమర్‌తో జోడిస్తూ చెప్పడం హిలేరియస్‌గా వుంది. శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు