Ganja Seized:వేర్వేరు చోట్ల దాడులు జరిపి గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు 26.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్న మరో తొమ్మిది మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేట నివాసి ఆకాశ్ సింగ్ ఒడిషా రాష్ట్రం నుంచి 25 కిలోల గంజాయిని తెప్పించుకున్నాడు.
దీనిని ద్విచక్ర వాహనంపై తీసుకెళుతుండగా ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ బీ టీం సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి ధూల్ పేట అవంతిబాయి విగ్రహం వద్ద పట్టుకున్నారు. ఆకాశ్ సింగ్ పై కేసులు నమోదు చేసి ధూల్ పేట ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఈ కేసుతో లఖన్ సింగ్, సంజయ్ సింగ్, జ్యోతిబాయి, ఆనంద్ సింగ్, మనష్ సింగ్, దీప, నిరంజన్ కుమార్ లకు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో వారిపై కూడా కేసులు పెట్టారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ రెండో దశ మెట్రోకు జైకా సహకారం.. ఫలించిన సీఎం చొరవ!
ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. ఇక, జియాగూడ ప్రాంతంలోని కాశీ శివమందిర్ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసి ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి బద్రీనారాయణ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో బంగ్లావాలా అజయ్ సింగ్, మంజూదేవిలకు సంబంధం ఉన్నట్టు విచారణలో తెలియటంతో వారిపై కూడా కేసులు పెట్టారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు