Manchu Lakshmi
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశారో.. ఇక అంతే!

Manchu Lakshmi: మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన టాప్ ఫ్యామిలీ పర్సన్‌ని అని కూడా ఆలోచించకుండా, కుర్ర హీరోయిన్లకు పోటీగా తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాకేం తక్కువ.. నేను హీరోయిన్ మెటీరియల్ అని అందరూ అనుకోవాలని ఈ మధ్య తెగ తాపత్రయ పడుతోంది. అందుకే వారం వారం ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆమె షేర్ చేసే ఫొటోల కోసమే కొందరు నెటిజన్లు వేచి చూస్తూ ఉంటారంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అందులోనూ, ఆమె ఇప్పుడు ముంబైలోనే ఉంటుంది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఇలా వారం వారం గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తుంది.

Also Read- Tamannaah Bhatia: తమన్నా సింప్లీ సూపర్బ్.. అందుకేగా అంత ప్రేమిస్తారు

అయితే ఆమె గ్లామర్ ఫొటోల కోసమని మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేశారో.. ఇక అంతే. మన జేబులు ఖాళీ అయిపోవడం కాయం. అదెలా అనుకుంటున్నారా? మంచు లక్ష్మి ఇన్‌స్టా అకౌంట్‌ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి.. ఆమె స్నేహితులకు అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అంతే కాదు, ఓ ట్రేడింగ్ పేజ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా కూడా ఇందులో ఉంది. తన ఫ్రెండ్ తనకి ఈ ట్రేడింగ్ కంపెనీ గురించి చెప్పాడని, దానిలో పాల్గొని రూ. 3 లక్షలకు పైగా అమౌంట్‌ని సొంతం చేసుకున్నట్లుగా కూడా కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. అంతే, ఆమె అకౌంట్‌ని ఓపెన్ చేసిన వారంతా ఒక్కసారిగా షాకవుతున్నారు. ఏమైంది మంచు లక్ష్మికి, ఇలా పోస్ట్‌లు చేస్తుంది ఏంటి? అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అంతేనా, మంచు ఫ్యామిలీలో ఈ మధ్య తలెత్తిన వివాదాలను ప్రస్తావిస్తూ.. మంచు లక్ష్మి ఇలా స్టార్ట్ చేసిందా? అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Sreemukhi: శ్రీముఖికి హీరోయిన్ ఛాన్స్? నెటిజన్స్ డిమాండ్ ఇదే..

ఇక ఈ విషయం మంచు లక్ష్మి వరకు చేరడంతో వెంటనే ఆమె అలెర్ట్ అయింది. వెంటనే ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరూ మనీ సెండ్ చేయకండి అంటూ ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు కూడా చేసి చెప్పిందట. నాకు డబ్బులు కావాలంటే నేరుగా అడుగుతాను, కానీ నా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూసి మోసపోకండి.. నా అకౌంట్‌ని హ్యాక్ చేశారు అంటూ మంచు లక్ష్మి అసలు విషయం చెప్పేసింది. అప్పుడు కానీ ఆమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా, తన అకౌంట్‌లో సైబర్ నేరగాళ్లు పెట్టిన పోస్ట్‌లను కూడా ఆమె స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది.

నా ఇన్ స్టా అకౌంట్ హ్యాకయింది. తిరిగి దీనిని నా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఏం చేయాలో చెప్పండి అంటూ కూడా నెటిజన్లను మంచు లక్ష్మి కోరింది. అలాగే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మంచు లక్ష్మీ తన అకౌంట్‌ని హ్యాక్ చేశారని చెప్పగానే నెటిజన్లు కొందరు కామెడీగా రియాక్ట్ అవుతున్నారు. ఇది మంచు విష్ణు పనే అయి ఉంటుంది. మీ మంచు ఫ్యామిలీలోని వారే చేసి ఉంటారు.. అంటూ సరదాగా రియాక్ట్ అవుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్