AP Interesting Facts (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Interesting Facts: దేశానికి ఏపీ ఇంత చేస్తోందా? ఆంధ్రులు మీసం మెలి వేయాల్సిందే!

AP Interesting Facts: దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఒకటి. ఈ ప్రాంతం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో కీర్తిని సంపాందించింది. అలాగే రాజకీయంగానూ చాలా బలమైన గడ్డగా ఏపీకి పేరుంది. పచ్చటి పొలాలు, వాణిజ్య పంటలు, సుప్రసిద్ధ పరిశ్రమలకు నెలవుగా రాష్ట్రం ఉంది. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఏపీలోని చాలా మందికి తెలియని ఇంకా చాలా ఉన్నాయి. బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు అన్నట్లుగా నీ ఢిల్లీకి ఏం కావాలి చెప్పు? అన్న రేంజ్ లో ఏపీ రాష్ట్రం..  దేశం మెుత్తానికి కొన్ని విషయాల్లో కింగ్ మేకర్ గా వ్యవహరిస్తోంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎర్ర చందనం..
సాధారణంగా ప్రతీ రాష్ట్రం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వస్తువులు ఎగుమతి జరుగుతుంటుంది. కానీ దేశం మెుత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే అది 5% లేదా 10% మాత్రమే ఉంటుంది. అయితే ఏపీ అలా కాదు. కొన్ని వస్తువుల విషయంలో యావత్ దేశమే ఏపీలో ఆధారపడుతోంది. గణనీయ సంఖ్యలో ఆయా వస్తువులు దేశం నలుమూలకు వెళ్తున్నాయి. అందులో ముఖ్యంగా రెడ్ శాండిల్ (Red sandalwood) అగ్రస్థానంలో ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి 90% మేర ఎర్ర చందనం ఎగుమతి అవుతోంది.

పామాయిల్ ఎగుమతి
వంటకు ఉపయోగించే పామాయిల్ నూనె (Palm Oil).. గణనీయంగా ఏపీ నుంచి ఎగుమతి అవుతోంది. దేశంలోని మెుత్తం పామాయిల్ ఉత్పత్తిలో 75% మేర ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోంది. అలాగే గుంటూరు నుంచి 60 శాతం రెడ్ చిల్లీ (Red Chilli), చిత్తూరు జిల్లా నుంచి 30 శాతం టమాటా (Tomato) దేశంలోని ఇతర ప్రాంతాలకు సప్లై అవుతోంది. అలాగే అనంతపురం నుంచి బొప్పాయి (Papaya) 30 శాతం, విజయవాడ నుంచి బాస్మతి రైస్ (Basmati Rice) 20 శాతం ఆంధ్రా నుంచి ఎక్స్ పోర్ట్ అవుతోంది.

సహజ వాయువులు
అంధ్రప్రదేశ్ ను భారత దేశానికి ఫ్యూచర్ స్టేట్ (Future State)గా అభివర్ణించేలా ఇక్కడ ఎంతో ముఖ్యమైన సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. కృష్ణ – గోదావరి బేసిన్ లోని ఈ నిక్షేపాలను దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. 2003 ఇక్కడ సహజ వాయువు కనుగొన్నారు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ ఇక్కడ సహజ వాయువును వెలికి తీస్తోంది. అంతేకాదు ఇక్కడ బంగారపు నిక్షేపాలను సైతం కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధ వజ్రం.. కోహినూర్ ను సైతం ఆంధ్రాలోనే బయటపడటం విశేషం.

Also Read: Shiva Rudra on Aghori: నిజమైన అఘోరాలు ఎంటర్.. లేడీ అఘోరీ ఇక పరార్?

వైద్యానికి పెద్దపీఠ
ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ ఆస్పత్రి బ్రాండ్ గా ఉన్న అపోలో (Apollo) సైతం ఆంధ్రా మూలాలను కలిగి ఉంది. అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి (Pratap C. Reddy).. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. తవణంపల్లె మండలం ఆరగొండ గ్రామంలో ఆయన జన్మించారు. అలాగే డాక్టర్ రెడ్డీస్ (Dr. Reddys) సంస్థను స్థాపించిన కల్లం అంజి రెడ్డి (Kallam Anji Reddy) కూడా ఏపీలోని తాడేపల్లి ప్రాంతంలో జన్మించారు. ఈ రెండు సంస్థలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకొని వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం.

భారత స్వాతంత్రంలోనూ..
బ్రిటిష్ బానిసల సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించడంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంతో మంది కృషి చేశారు. స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసి యావత్ దేశం చేతులెత్తి నమస్కరించేలా చేసిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) సైతం ఈ ఆంధ్రాకు చెందిన వారే. అలాగే ప్రతీ ఒక్కరు తలెత్తుకునేలా చేసే మువ్వన్నెల జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య (Pingali Venkayya).. విజయవాడకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?