Raj Tarun - Lavanya Controversy
ఎంటర్‌టైన్మెంట్

Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని గెంటేసిన లావణ్య.. మళ్లీ మొదలు!

Raj Tarun – Lavanya: గతేదాడి బాగా హైలెట్స్ అయిన వివాదాలలో రాజ్ తరుణ్ – లావణ్య వివాదం కూడా ఒకటి. రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ టాపిక్ ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హాట్‌గా మారింది. అయితే కొన్ని రోజులుగా కాస్త సద్దుమణిగిన ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి లావణ్యకు, రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు మధ్య వివాదం మొదలైంది. అదీ కూడా ఇంటి విషయంలో. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు మాదంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ధర్నాకు దిగడంతో.. మరోసారి రాజ్ తరుణ్ – లావణ్యల వివాదం తెరపైకి వచ్చింది.

Also Read- Kushboo Sundar: ఇంజక్షన్ల అందం అన్నందుకు.. ఇచ్చిపడేసింది

రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేట్‌లోని పల్లవి బ్లోవర్డ్ విల్లాస్‌లో ఉన్న రాజ్ తరుణ్ ఇంటికి లగేజ్‌తో చేరుకుని, ఆ ఇంట్లో ఉంటున్న లావణ్యను ఖాళీ చేయాలని కోరారు. అందుకు లావణ్య ఎవరు మీరు అంటూ వారిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఇక్కడ నీ కొడుకుకు ఎలాంటి ఇల్లు లేదు, నాకు రాసిచ్చేశాడు అంటూ వారిని గెంటేసినట్లుగా తెలుస్తుంది. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, బసవరాజు ఇంటి ముందు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ ఇంటికి చేరుకున్నారు.

అయితే ఇదే విషయంపై లావణ్య స్పందిస్తూ.. వాళ్లు నిజంగా నా అత్తమామలుగా వచ్చినా, లేదంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా వచ్చినా నేను లోపలికి రానిచ్చేదానిని. కానీ వారు దౌర్జన్యం చేస్తూ, 15 మందితో వచ్చి నాపై దాడి చేయబోయారు. అందుకే నేను తలుపేశాను అంటూ లావణ్య చెబుతుంది. గతంలో జరిగిన అన్నింటికీ నేను రాజ్ తరుణ్‌కి, వారి అమ్మ నాన్నలకు సారీ చెప్పాను. మేము తిట్టుకున్నా, కొట్టుకున్నా, నాకు రాజ్ తరుణ్ కావాలనే అంటున్నాను. కేవలం వారిద్దరే వచ్చి ఉంటే నిరభ్యంతరంగా రానిస్తాను. రాజ్ తరుణ్ వచ్చినా రానిస్తాను. కానీ వారిని రానిచ్చే ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నాపై ముందుగా ఎవరు అటాక్ చేశారనేది వివరణ ఇచ్చిన తర్వాతే వారిని రానిస్తాను.

Also Read- Vijayashanthi: పవన్ సతీమణి అన్నాపై ట్రోల్స్.. రాములమ్మ షాకింగ్ పోస్ట్

ఎందుకంటే, వారు సుమారు 15 మంది ఆడవాళ్లను తీసుకుని వచ్చి, నాపై దాడి చేయబోయారు. డోర్లు పగలగొట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ని నాశనం చేసి, ఇల్లంతా ధ్వంసం చేశారు. ఇది అందరికీ తెలియాలి. ఎవరిది తప్పు ఉందనేది అందరికీ తెలిసిన తర్వాత మాత్రమే నేను వారిని లోపలకు రానిస్తాను. నిజంగా వారు నాకు అత్తమామలుగా వస్తే, లోపలికి పిలిచి, వారికి వంట కూడా చేసి పెడతాను. వారు అలా రాలేదు అని లావణ్య చెబుతుంది. మరోవైపు మా ఇంటిలోకి మేము వెళ్లడానికి ఎవరి అనుమతి తీసుకోవాలి అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయట ధర్నాకు దిగారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు