Target Seemaraja (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

Target Seemaraja: నెక్స్ట్ టార్గెట్ సీమరాజా? వైసీపీ ప్లాన్ షురూ?

Target Seemaraja: వైసీపీ ప్లాన్ ఓ రకంగా చేబ్రోలు కిరణ్ విషయంలో సక్సెస్ సాధించింది. అదే ప్లాన్ తో మరో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ సీమరాజాపై వైసీపీ కన్నేసింది. ఈ సీమరాజా సెటైర్స్ వేస్తూ వైసీపీని మరింత ఇరకాటంలో పెడుతున్నారన్నది వైసీపీ నాయకుల అభిప్రాయం. అందుకే నిన్న కిరణ్, నేడు సీమరాజాను వైసీపీ టార్గెట్ చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఎవరీ సీమరాజా?
ఏపీలో ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో తళుక్కున మెరిశారు సీమరాజా. ముందు అందరూ వైసీపీ పార్టీ కార్యకర్తగా భావించారు. సీమరాజా కూడా తాను వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శినంటూ పరిచయం చేసుకున్నారు. రోజూ సోషల్ మీడియా వేదికగా, మళ్లీ మాజీ సీఎం జగన్ ను సీఎం చేయాలంటూనే కౌంటర్స్ సాగిస్తూ వచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తరహాలో యాస, ప్రాసతో ఆకట్టుకొనే సీమరాజా, తాను వైసీపీ అంటూనే ఆ పార్టీకి చురకలు అంటిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో సీమరాజాకు తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పవచ్చు. అందుకే కాబోలు సీమరాజాకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. సమయ సంధర్భోచిత కామెంట్స్ చేస్తూ, అందరినీ నవ్వించే రేంజ్ లో ఇతని కామెంట్స్ ఉండడంతో నెటిజన్స్ ఇతనికి తెగ ఫాలో అవుతున్నారు.

ఎన్నికల తర్వాత..
ఎన్నికలు ముగిశాయి. సీమరాజా ఇక సైలెంట్ అనుకున్నారు కొందరు. కానీ కాస్త గ్యాప్ ఇచ్చిన సీమరాజా, మళ్లీ వైసీపీ అంటూనే అదే పార్టీపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడిన కొందరిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా సీమరాజాపై ఫిర్యాదు చేశారు. తన మనోభావాలు దెబ్బతినేలా సీమరాజా పోస్టింగ్స్ ఉన్నాయని అంబటి ఆరోపణ. అంతేకాకుండా వైసీపీనే అంటాడు, టిడిపికి మద్దతుగా మాట్లాడుతాడు అంటూ అంబటి కామెంట్స్ కూడా చేశారు.

అంబటి ఫైర్..
ఆ తర్వాత అంబటి కామెంట్స్ కు సీమరాజా కూడా స్పందిస్తూ, తానెప్పుడూ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఇలా సీమరాజా సోషల్ మీడియా వేదికగా వైసీపీపై విమర్శలు సాగిస్తూ వస్తున్నారు. కానీ ఈయన పార్టీ కండువా మాత్రం వదలకుండా విమర్శలు గుప్పిస్తుండగా, అదే ఇప్పుడు వైసీపీ నేతల ఆగ్రహానికి కారణమని ప్రచారం సాగుతోంది. కాగా తమ పార్టీని ఇరకాటంలో పెట్టే వారికి చెక్ పెట్టే దిశగా వైసీపీ స్కెచ్ వేసినట్లు కిరణ్ అరెస్ట్ సాగిందని ప్రచారం. ఐటిడిపిలో గల కిరణ్ తీవ్రమైన స్థాయిలో కామెంట్స్ చేయగా, వైసీపీ సోషల్ మీడియా ఏకమై విమర్శలు గుప్పించింది. అయితే సాధారణంగా మహిళలను కించపరిస్తే ఎవరినీ వదిలేది లేదనే రీతిలో టిడిపి అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాక, అరెస్ట్ పర్వాన్ని కూడా సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా కిరణ్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ సాధించిందని ఆ పార్టీ అభిప్రాయం.

Also Read: Shiva Rudra on Aghori: నిజమైన అఘోరాలు ఎంటర్.. లేడీ అఘోరీ ఇక పరార్?

కిరణ్ తర్వాత సీమరాజా?
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ గా సీమరాజాను ఎంచుకుందని చెప్పవచ్చు. ఇలా చెప్పేందుకు ప్రధాన కారణం ఏమిటంటే, ఇటీవల సీమరాజా వ్యక్తిగత వివరాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో ఆ వివరాలు వైసీపీ చెంతకు ఎలా చేరాయో కానీ, సీమరాజా మాత్రం తనను అడిగితే ఇచ్చేవాడిని, అంత ఆరాటం ఎందుకు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా సీమరాజాను ఇరకాటంలో పెట్టి నోరు మూయించాలన్న ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ప్రారంభించిందని ప్రచారం సాగుతోంది. కానీ సీమరాజా మాత్రం తగ్గేదెలే అంటూనే, తాను ఎప్పుడూ లైన్ దాటి ఎవరినీ విమర్శించలేదని, తనకు మాజీ సీఎం జగన్ మళ్లీ సీఎం కావాలన్నదే లక్ష్యమని పాతపాటే పాడుతున్నారు. ఇలా సీమరాజా, వైసీపీ సోషల్ మీడియా మధ్య వివాదం సాగుతోంది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు