Shiva Rudra on Aghori (Image Source: Twitter)
తెలంగాణ

Shiva Rudra on Aghori: నిజమైన అఘోరాలు ఎంటర్.. లేడీ అఘోరీ ఇక పరార్?

Shiva Rudra on Aghori: లేడీ అఘోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మరింత ముదురుతోంది. శ్రీవర్షిణి (Sri Varshini) అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ ఇటీవల పదే పదే వార్తల్లో ఉంటూ వచ్చిన అఘోరీ.. తాజాగా ఆమెను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అఘోరీకి ఇదివరకే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అఘోరీ తన మెడలో తాళీ కట్టాడంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు సైతం వచ్చింది. ఈ క్రమంలోనే బాధిత యువతితో కలిసి మహిళా కమీషన్ వద్దకు వెళ్లిన శివ సాధువు శివ రుద్ర స్వామి (Shiva Rudra Swami).. లేడీ అఘోరీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అకాడాల నుంచి ప్రెస్ నోట్
బాధిత యువతిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని శివ రుద్ర స్వామి అన్నారు. వాటిని మహిళా కమీషన్ కు అందజేసినట్లు చెప్పారు. తనను ఎదిరిస్తే మంత్రాలతో శపిస్తానని అఘోరీ బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు శివ రుద్ర స్వామి అన్నారు. అతడికి ఎలాంటి మంత్రాలు రావని.. అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అఘోరీ అసలు అఘోరానే కాదని అకాడాల సంఘం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అఘోరీ ఆగడాలపై చేస్తున్న ఈ పోరాటంలో సాదువులు, మఠాధిపతులు తనకు అండగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

నీ పెళ్లి చెల్లుబాటు కాదు
శ్రీవర్షిణీ పెళ్లి చేసుకోవడంపైనా శివ రుద్ర స్వామి స్పందించారు. హిందూ శాసన గ్రంథాలతో పాటు చట్ట ప్రకారం కూడా ఆ పెళ్లి చెల్లుబాటు కాదని అన్నారు. ఆ యువతి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరీకి వ్యతిరేకంగా ఇవాళ ఒక స్త్రీ బయటకొచ్చిందని.. ఇక నీ పతనం మెుదలైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో చట్ట ప్రకారం నీకు కావాల్సిన మర్యాదలు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.

Also Read: Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి.. లేదంటే!

నేను మాటిస్తున్నా
తాను ఆశ్రమం కట్టుకుంటున్నట్లు అఘోరీ మాయ మాటలు చెబుతోందని శివ రుద్ర స్వామి అన్నారు. ఈ ఆశ్రమాన్ని నువ్వు ఎలా కడతావో తాను చూస్తానని సవాలు చేశారు. సాదు సంతువులను ఏకం చేసి అఘోరీని పతనం చేయకపోతే తన పేరు మార్చుకుంటాని సవాలు విసిరారు. అఘోరా వేషధారణ వేసుకొని తన తండ్రైన పరమ శివుడికి అపవాదు తెస్తుంటే చూస్తూ ఊరుకోనని శివ రుద్ర స్వామి స్పష్టం చేశారు. నీ మెడలోని రుద్రాక్షలను దింపేస్తానని అన్నారు. శ్రీవర్షిణీ తల్లిదండ్రులు తన కాళ్లకు మెుక్కి ఏడుస్తున్నారని.. వారి ఊసురు కచ్చితంగా అఘోరీకి తగులుతుందని అన్నారు. నీకున్న అఘోరీ ట్యాగ్ ను వారం పది రోజుల్లో తొలగించి తీరుతానని అన్నారు.

సాధువు ఆగ్రహం
మరోవైపు శ్రీవర్షిణిని అఘోరీ పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పేనని మరో సాధువు స్పష్టం చేశారు. నాగసాధు అఘోరీ అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ ను వెంటనే శిక్షించాలని ఓ సాధువు వీడియా రిలీజ్ చేశారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల బాధ్యత అంటూ గుర్తు చేశారు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. తమ కూతురు జీవితం కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికైనా స్పందించి అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ