Police Training Centre [image credit: SWETCHA REPORTER]
తెలంగాణ

Police Training Centre: దీక్షతో దేశ సేవకు సిద్ధమైన 142 కానిస్టేబుళ్లు.. అదనపు డీజీ శ్రీనివాసరావు ప్రసంగం

Police Training Centre: వృత్తిని దైవంగా భావించి విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీస్​ అకాడమీ డైరెక్టర్, అదనపు డీజీ వీ.వీ.శ్రీనివాస రావు అన్నారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడేందుకు అంకిత భావంతో పని చేయాలన్నారు. ప్రజలకు భద్రత కల్పించినపుడే వారిలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. మేడ్చల్​ కండ్లకోయలోని పోలీస్ ట్రైనింగ్​ సెంటర్​ లో శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్​ మంగళవారం జరిగింది.

దీనికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు డీజీ శ్రీనివాస రావు మాట్లాడుతూ పోలీస్​ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. క్రమశిక్షణతో పని చేసి వీటిని అధిగమించాలని చెప్పారు. తెలంగాణ పోలీసు శాఖ దేశానికే దిక్సూచిగా ఉందన్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్​ ను ప్రారంభించినట్టు చెప్పారు.

 Also Read: Stree Summit 2.0: మహిళ సాధికారతపై ఫోకస్.. కోటిమందికి కోటీశ్వరులు చేయడం మా లక్ష్యం.. భట్టి విక్రమార్క

ట్రైనింగ్​ సెంటర్​ ప్రిన్సిపల్​, ఎస్పీ మధుకర్​ స్వామీ మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠోర శిక్షణ తీసుకున్న కానిస్టేబుళ్లు అందరూ విధుల్లో చేరిన తరువాత క్రమ శిక్షణ, నైతిక విలువలతో పని చేయాలన్నారు. తద్వారా రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేయాలని చెప్పారు. అనంతరం ట్రైనింగ్​ సెంటర్లో కొత్తగా నిర్మించిన ఫౌంటెయిన్​లు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్​, ఫోరెన్సిక్​ ల్యాబ్​, సీసీటీవీలను అదనపు డీజీ శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్​ గూడ బెటాలియన్ కమాండెంట్​ పీ.మురళీ కృష్ణ, ట్రైనింగ్​ కాలేజీ డీఎస్పీలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్