CM Revanth Reddy [ image credit: twitter}
తెలంగాణ

CM Revanth Reddy: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్ హోటల్‌లో కలకలం

CM Revanth Reddy:  ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్​ ఓవర్​ వెయిట్​ కారణంగా ఒక్కసారిగా కిందకు కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తీశారు. కాంగ్రెస్​ శ్రేణుల్లో కలకలం సృష్టించిన ఈ సంఘటన శంషాబాద్​ లోని నోవాటెల్​ హోటల్​ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రజా సంక్షేమం దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసేందుకు ఆ పార్టీ మంగళవారం నోవాటెల్​ హోటల్​ లో సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ మహేశ్​ కుమార్​ గౌడ్​ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి రెండో అంతస్తుకు వెళ్లటానికి లిఫ్ట్​ ఎక్కారు.

 Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఇకపై సీఎం కనుసన్నల్లో ప్రజావాణి.. కష్టాలు తీరినట్లే!

అయితే, ఎనిమిది మంది మాత్రమే లిఫ్టులో ఎక్కాల్సి ఉండగా మొత్తం 13మంది దాని లోపలికి వెళ్లారు. దాంతో పైకి వెళ్లాల్సిన లిఫ్ట్​ పెద్దగా శబ్ధం చేస్తూ ఒక్కసారిగా కిందకు కుంగిపోయింది. వెంటనే అలర్ట్​ అయిన భద్రతా సిబ్బంది హోటల్ వర్గాలకు సమాచారం అందించారు. అనంతరం హోటల్​ సిబ్బంది సహకారంతో లిఫ్ట్​ డోర్​ తెరిచి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితోపాటు మిగితా వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత సీఎం రేవంత్​ రెడ్డి మరో లిఫ్టులో రెండో అంతస్తుకు వెళ్లారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?