Teacher Posts in AP: ఏపీలో మెగా డీఎస్సీ ముందుగానే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పవచ్చు.
పూర్తి వివరాలలోకి వెళితే..
ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేయనుంది.
ఇప్పటికే మెగా డీఎస్సీ కోసం ఎదురుచూపుల్లో ఉన్న నిరుద్యోగుల కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రక్రియను పాఠశాలల ప్రారంభం లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. అందుకు తగిన ఏర్పాట్లలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం నిమగ్నమయ్యారు. అయితే అంతలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: AP Cabinet – CM Chandrababu: ఏపీలో హై రేంజ్ అసెంబ్లీ.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు..
ఏపీలో కొత్తగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, జిల్లాల వారీ ఖాళీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురం ఎస్జీటీ 101, స్కూల్ అసిస్టెంట్ 100, చిత్తూరు ఎస్జీటీ 117, స్కూల్ అసిస్టెంట్ 82, ఈస్ట్ గోదావరి ఎస్జీటీ 127, స్కూల్ అసిస్టెంట్ 151, గుంటూరు ఎస్జీటీ 151, స్కూల్ అసిస్టెంట్ 98 , వైఎస్సార్ కడప ఎస్జీటీ 57, స్కూల్ అసిస్టెంట్ 49, కృష్ణా ఎస్జీటీ 71, స్కూల్ అసిస్టెంట్ 89, కర్నూల్ ఎస్జీటీ 110, స్కూల్ అసిస్టెంట్ 130, నెల్లూరు ఎస్జీటీ 63, స్కూల్ అసిస్టెంట్ 44, ప్రకాశం ఎస్జీటీ 74, స్కూల్ అసిస్టెంట్ 50, శ్రీకాకుళం ఎస్జీటీ 71, స్కూల్ అసిస్టెంట్ 109, విశాఖపట్టణం ఎస్జీటీ 59, స్కూల్ అసిస్టెంట్ 52, విజయనగరం ఎస్జీటీ 45, స్కూల్ అసిస్టెంట్ 66, వెస్ట్ గోదావరి ఎస్జీటీ 90, స్కూల్ అసిస్టెంట్ 105 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరెందుకు ఆలస్యం.. అప్లై చేసుకోండి.