Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కెరీర్ ప్రారంభంలో ఎంతో పద్ధతిగా, పదహారణాలు తెలుగింటి అమ్మాయిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్, ప్రస్తుతం మాత్రం గ్లామర్‌తో టాలెంట్ చూపిస్తుంది. ఎక్స్‌పోజింగ్, కిస్సులతో రెచ్చిపోతూ తనలోని రెండో కోణాన్ని చూపిస్తుంది. హీరోలకు లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు ఓ స్టార్ హీరో కుమారుడితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమేనా? కాదా? అనుకునేలోపే ఆ హీరోతో గాఢమైన లిప్‌లాక్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
Also Read- Siddu Jonnalagadda: ‘జాక్’ ఇచ్చిందిగా ‘షాక్’.. అదే దెబ్బకొట్టిందా?
ఇంతకీ ఆ స్టార్ హీరో కుమారుడు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు, కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram). అవును, ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియాతో పాటు టాలీవుడ్ మీడియా కూడా బాగా హైలెట్ చేస్తుంది. ధ్రువ్, అనుపమల లిప్‌లాక్ పిక్‌ని హైలెట్ చేస్తూ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ, ప్రస్తుతానికైతే అనుపమపై ఈ వార్తలు ఆగడం లేదు.
మరోవైపు ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘బైసన్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమకు, ధ్రువ్‌కి మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని, అందులోని సీన్‌కు సంబంధించిన లిప్‌లాక్ ఫొటోనే ప్రస్తుతం వైరల్ అవుతుందని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కబడ్డీ ప్లేయర్‌గా ధ్రువ్ ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాపై ధ్రువ్ మాత్రమే కాదు, అనుపమ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఆమె బిజీ హీరోయిన్‌గా మారుతుందని ఆశపడుతోంది.
Also Read- Devara 2: ‘దేవర 2’ ఎప్పుడో క్లారిటీ అయితే వచ్చేసింది..
కేరళ కుట్టి అయిన అనుపమ ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగానే ఆఫర్లు రాబట్టుకుంటుంది. టిల్లు స్క్వేర్ రూపంలో మంచి బ్రేక్ కూడా లభించింది. ప్రస్తుతం ‘పరదా’ సినిమాతో అలరించేందుకు ఆమె సిద్ధమవుతోంది. అలాగే ‘బైసన్’ కూడా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మలయాళంలోనూ ఆమె కొన్ని సినిమాలను చేస్తున్నారు. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న అనుపమపై ఇలాంటి వార్తలు రావడంతో.. ఆమె కూడా షాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రూమర్‌పై ఆమె మాత్రం ఇంత వరకు రెస్పాండ్ కాలేదు. అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే ‘ప్రేమమ్’ (Premam) సినిమాతో ఆమె నటిగా అరంగేట్రం చేశారు. తెలుగులో ‘అ ఆ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ వంటి చిత్రాల సక్సెస్‌తో అనుపమ టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు