Siddu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకి ‘జాక్’ (Jack) రూపంలో షాక్ తగిలింది. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నిర్మించింది. సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ల తర్వాత సిద్ధు నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంటే భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాకపోతే, సినిమా కంటెంట్ పరంగా ఆడియెన్స్‌ని మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాపై మొదటి నుంచి వినిపించిన అంశాలపై చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. అవేంటని అనుకుంటున్నారా?
Also Read- Allu Arjun – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి హీరో అల్లు అర్జున్..
మొదటి నుంచి ఈ సినిమా విషయంలో సిద్ధు, బొమ్మరిల్లు భాస్కర్‌ల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. సిద్ధు ఈ సినిమాకు సంబంధించి బాగా ఇన్వాల్వ్ అయినట్లుగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పబ్లిగ్గా చెప్పాడు. మీడియా సమావేశాల్లో కూడా చిన్న చిన్న విషయాలు జరిగినట్లుగా టీమ్ వెల్లడించింది. అలాగే సినిమా విడుదలకు ముందు ఈ సినిమాకు రావాల్సిన హైప్ రాలేదనే చెప్పుకోవాలి. ఒక్క టీజర్ తప్పితే.. ఏదీ నోటెడ్ అవ్వలేదు. కనీసం పాటలు కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవడం విశేషం. అంతేనా, మ్యూజిక్ విషయంలో టీమ్ కూడా పెదవి విరిచింది. ఇప్పటి వరకు జరిగిన మీడియా సమావేశాల్లో హీరో, దర్శకుడు మాట్లాడిన మాటలు వింటే, వారిద్దరి మధ్య ఈ సినిమా విషయంలో దారులు వేరుగా ఉన్నాయనేది స్పష్టమైంది. అదే ఈ సినిమాకు పెద్ద దెబ్బకొట్టిందనేలా అంతా మాట్లాడుకుంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డకి ఉన్న టాలెంట్ ప్రకారం, తన స్టైల్‌లోకి ఈ సినిమాను మార్చేసుకోవచ్చు. కానీ, దర్శకుడు భాస్కర్ స్టోరీ లైన్ నచ్చే కదా ఈ సినిమా చేయడానికి ఓకే చేశాడు. సినిమా ఎలా వస్తుంది? అనేది సిద్ధుకీ అర్థం కాకుండా ఉంటుందా? అందులోనూ ఈ మధ్య ప్రేక్షకుల పల్స్ బాగా పట్టుకుని మరి సిద్ధు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అలాంటిది, ఈ సినిమా కంటెంట్ విషయంలో సిద్ధు ఎందుకలా కళ్లు మూసుకుని ఉండి ఉంటాడనేలా ఇప్పుడు ఆయన అభిమానులు కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి సినిమాల విషయంలో సిద్ధు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read- HIT 3 Movie Trailer: నానికి చాగంటి గారి హై ఓల్టేజ్ ఎలివేషన్స్.. ట్రైలర్ అరాచకం భయ్యా!
ప్రస్తుతం సిద్ధు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి సమయంలో చేసే చిన్న చిన్న తప్పులు.. కెరీర్‌కు ఆటంకంగా మారుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ప్రకారం ఒక్క సినిమాతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ ఏం కాదు కానీ, ఇకపై చాలా జాగ్రత్తగా సిద్ధు స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి కాబట్టి, నెక్ట్స్ సినిమాతో సిద్ధు అభిమానులు అనుకుంటున్న సక్సెస్‌తో అలరిస్తాడని అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ‘జాక్’ గురించి సిద్ధు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు