Devara 2 Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Devara 2: ‘దేవర 2’ ఎప్పుడో క్లారిటీ అయితే వచ్చేసింది..

Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr Ntr) దృష్టి అంతా ప్రస్తుతం సినిమాలపైనే ఉంది. తాజాగా జరిగిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) ప్రీ రిలీజ్ వేడుక కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. ఈ వేడుకలో అభిమానులంతా ‘సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్’ (CM NTR) అని అరుస్తుంటే.. స్టేజ్ వదిలి వెళ్లిపోవడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. నన్ను ఈ స్టేజ్ మీద ఉండనివ్వరా? అంటూ అభిమానులను క్వశ్చన్ చేశారు. దీంతో మరోసారి పాలిటిక్స్‌పై తనకు ఎటువంటి ఆశ, పాలిటిక్స్‌లోకి రావాలనే కోరిక లేవనేది స్పష్టం చేసినట్లయింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎన్టీఆర్ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..

Also Read- Siddu Jonnalagadda: ‘జాక్’ ఇచ్చిందిగా ‘షాక్’.. అదే దెబ్బకొట్టిందా?

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి ‘కెజియఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (Dragon) అనే పాన్ ఇండియా సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ‘వార్ 2’, ‘డ్రాగన్’.. మరి ‘దేవర 2’ సినిమా ఎప్పుడు? అని ఫ్యాన్స్ అంతా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్‌తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘దేవర 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉండబోతుందనే వార్తలకు తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. ‘దేవర 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉండబోతుందో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వార్ 2’ సినిమాను తారక్ ‘దేవర’ కంటే ముందే ఓకే చేశాడు. అలాగే ప్రశాంత్ నీల్, తారక్ సినిమా కూడా ‘సలార్’ కంటే ముందే ఓకే అయ్యింది. ఆ సినిమా ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లింది. ఈ రెండు సినిమాల తర్వాత ‘దేవర 2’ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్‌లో మెరుగులు దిద్దుతున్నారని చెప్పుకొచ్చారు.

Also Read- Allu Arjun – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి హీరో అల్లు అర్జున్..

కళ్యాణ్ రామ్ చెప్పిన దానిని బట్టి చూస్తే.. నెల్సన్‌తో తారక్ చేయాల్సిన సినిమా చాలా ఆలస్యం అవుతుందనేది మాత్రం తెలుస్తుంది. ‘వార్ 2’, ‘డ్రాగన్’ తర్వాత ‘దేవర 2’ సినిమానే సెట్స్‌పైకి వెళుతుందనేది మాత్రం స్పష్టమైంది. అభిమానుల క్వశ్చన్స్‌కు కూడా ఆన్సర్ లభించినట్లయింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ‘దేవర 2’ కోసం ఫ్యాన్స్ అంతగా ఎదురు చూస్తున్నారు మరి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు