CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)పెట్టుబడులు తీసుకురావడానికి ఎనిమిది రోజులపాటు జపాన్ లో ( Japan) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర శాఖలకు చెందిన అధికారులు కూడా వెళ్లనున్నారు. ఏప్రిల్ 16 నుండి 22 వరకు జపాన్ లోనే ఉండనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన సాగనుంది.
Also Read: Jagga Reddy A war of Love: లవర్స్ ను ఒకటి చేయనున్న జగ్గారెడ్డి.. ఎందుకిలా? అసలేం జరిగింది?
ఇదే కాకుండా, ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్సపో లో (Industrial Expo) కూడా సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆ తర్వాత టోక్యో లో పెట్టుబడుల పై పలు పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధి పై రేవంత్ బృందం అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం (Skill University in Telangana) జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సంస్థలను కలవనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TG on SDRF: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ. 4 లక్షల సాయం అందించేందుకు రెడీ..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు