Scariest Sea Animal: ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. మన కంటికి కనిపించేవి కొన్ని అయితే, కనిపించనవి చాలానే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించము. అలాగే, సముద్రంలో కూడా కొన్ని లక్షల జీవులు వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. సముద్రంలో తేలియాడే జీవులు మాత్రమే మనకి తెలుసు. కానీ, దీని అడుగున కూడా కొన్ని రకాల జీవులున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొన్ని నార్మల్ గా ఉంటే, మరి కొన్ని అత్యంత భయంకరమైనవి ఉంటాయి. ఇవి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. ఇక కొన్ని అయితే ఇవి నిజంగానే జంతువులేనా ? అన్నట్టు మనకి సందేహాన్ని కలిగిస్తాయి. వాటిని చూసినప్పుడు మనం నమ్మలేము కూడా.. అయితే, ఇప్పుడు మనం అలాంటి జీవి గురించే ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Minister Sridhar Babu: పెద్దమొత్తంలో ఆ పథకానికి నిధులు విడుదల.. మంత్రి శ్రీధర్ బాబు
చూడటానికి మొక్క లాగా కనిపిస్తుంది కానీ, ఇది మొక్క కాదు. గార్డెన్ ఈల్ ( Garden Eel ) అనే అత్యంత భయంకరమైన చేప. ఇది ఇండో పసిఫిక్ , ప్రపంచం వ్యాప్తంగా ఉన్న వెచ్చని సముద్రంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది సముద్ర గర్భం కింద ఉన్న బొరియలలో నివసిస్తుంది. దీని మొత్తం శరీరాన్ని బొరియలలో కప్పి పెడుతుంది. ఇవి తన తలను మాత్రమే బయటకు కనబడేలా ఉంచుతుంది. ఇది నీటిలో కదులుతూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం అని భావించినప్పుడు మాత్రమే దాని రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది 40 సెంటి మీటర్ల పొడవు ఉంటుంది. దీని శరీరం మిగతా జీవులకంటే తెల్లగా మెరుస్తూ, నల్ల మచ్చలతో ఉంటుంది. ఇది కొట్టుపోతున్న చిన్న జీవులను మాత్రమే తింటుంది. ఇదే వాటి ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Bhu Bharati Portal: బాబోయ్.. భూ భారతి పోర్టల్ ను ఇంత బాగా డిజైన్ చేశారా? ఆ సమస్యలు తీరినట్లే!
ఇది 20 నుండి 50 మీటర్ల లోతులో ఒక బొరియను తవ్వుకుని నివసిస్తుంది. దాని శరీరంలో ఒక వంతు మాత్రమే మనకి బయటకు కనిపిస్తుంది. దీని మీద ఇతర సముద్ర జీవులు దాడి చేయడానికి చేస్తే, అక్కడ నివసించే గార్డెన్ ఈల్స్ అన్నిఏకమయ్యి భయపెడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు