Twist in Aghori Story: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ అఘోరీ – శ్రీవర్షిణి ప్రేమ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. తాను అఘోరీ భార్యనేనంటూ ఓ యువతి బయటకు రావడం తీవ్ర చర్చకు తావిస్తోంది. అఘోరి స్వయంగా తనకు తాళి కట్టిందని సదరు యువతి ఆరోపించింది. అంతేకాదు అఘోరీ ఆ యువతితో సన్నిహితంగా మాట్లాడిన ఆడియో కాల్ సైతం బయటకు రావడం మరింత ఆసక్తి రేపుతోంది.
ఆ రోజున పెళ్లి
లేడీ అఘోరీకి తనకు ఈ ఏడాది జనవరి 1న పెళ్లి జరిగిందని బాధిత యువతి ఆరోపించింది. తన పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి శ్రీనివాస్ (అఘోరీ) తనకు తాళి కట్టినట్లు ఆమె చెప్పింది. అయితే జనవరి 30న వర్షిణీ అనే అమ్మాయిని చేసుకున్నట్లు ఆయన చెప్పాడని యువతి పేర్కొంది. మెుదటి భార్య తానుండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని బాధిత మహిళ నిలదీసింది. ఇలా ఎంత మంది జీవితాలతో అఘోరీ ఆడుకుంటాడని ప్రశ్నించింది. అఘోరీ ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే తాను బయటకు వచ్చినట్లు యువతి స్పష్టం చేసింది.
"లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే".. ఓ యువతి సంచలనం
తమ పెళ్లి జనవరి 1న జరిగిందని తెలిపిన యువతి
ఆ తర్వాత వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటికి వచ్చినట్లు వెల్లడి
మీడియా, పోలీస్ శాఖ, ప్రభుత్వం ఈ విషయంలో అఘోరీపై చర్యలు తీసుకోవాలని కోరిన యువతి pic.twitter.com/5KI7g1D3qn
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025
చర్యలు తీసుకోండి
అఘోరీ తనకు చేసిన అన్యాయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె మీడియా ముఖంగా బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అఘోరీతో పరిచయం గురించి ప్రస్తావించిన బాధితురాలు.. తొలుత భక్తి భావంతో తానే అఘోరీని కాంటాక్ట్ అయినట్లు చెప్పింది. అలా ఏర్పడిన పరిచయం మరింత సన్నిహితంగా మారిందని పేర్కొంది. ఆ విధంగా ఇద్దరం పెళ్లి చేసుకున్నట్లు సదరు యువతి తెలిపింది. ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని సేవ చేసుకుంటూ ఇద్దరం ఉండిపోవాలని అనుకున్నట్లు చెప్పింది.
మాటలు మారుస్తుంటారు
అఘోరీ ఎప్పుడు ఒక మాటపై ఉండడని బాధిత యువతి ఆరోపించింది. ఆశ్రమం ఏర్పాటుకు కావాల్సిన స్థలం ఇద్దరం తెగ తిరిగినట్లు చెప్పింది. మళ్లీ సడన్ గా ఆ విషయాన్ని విడిచిపెట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలో వర్షిణి (Sri Varshini) అంశం తెరపైకి రాగా.. తాను అఘోరీని ప్రశ్నించినట్లు చెప్పింది. అయితే వర్షిణి తనకు కూతురు అవుతుందని.. నేను తనకు గురువును మాత్రమేనని అఘోరీ సమాధానం చెప్పాడని బాధితురాలు పేర్కొంది. మెుత్తం అఘోరీ ప్రేమ, పెళ్లి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది.
Also Read: Sri Varshini on Aghori: ఉప్పెన మూవీని తలపిస్తున్న అఘోరీ ప్రేమ కథ.. అదేం పెద్ద సమస్య కాదట!
వర్షిణీతో పరిచయం ఎలా అంటే?
కుటుంబ సభ్యుడు శ్రీవిష్ణు ద్వారా అఘోరీతో వర్షిణికి పరిచయం అయ్యింది. ఓ రోజు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద అఘోరి కారు ఆగిపోగా.. విష్ణు అఘోరిని చూసి తన ఇంటికి రావాలని సూచించారు. అఘోరి ఆ ఇంట్లో దాదాపు రెండు వారాలు ఉండగా.. ఈ క్రమంలో శ్రీవర్షిణి ఆమె మాయలో పడిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఇద్దరూ చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.