Uppal Balu: తాను లేడీ అఘోరీగా మారేందుకు సిద్ధమని, తనను కూడా ప్రజలు నమ్ముతారా అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్ ఉప్పల్ బాలు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలు సంచలన కామెంట్స్ చేశారు. లేడీ అఘోరీ లక్ష్యంగా ఉప్పల్ బాలు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇటీవల లేడీ అఘోరీ లక్ష్యంగా కొన్ని విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళగిరికి చెందిన శ్రీ వర్షిణి అనే బీటెక్ యువతి కుటుంబ సభ్యులు వర్సెస్ లేడీ అఘోరీ మధ్య వివాదం నడుస్తోంది. లేడీ అఘోరీ లక్ష్యంగా పలు హిందూ సంఘాలు విమర్శలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ ఎప్పుడూ ఏదొక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది.
బీటెక్ చదువుతున్న యువతి జీవితాన్ని నాశనం చేసిన అఘోరీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడిన ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు హైలెట్ గా మారింది. లేడీ అఘోరీ గురించి ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. కుంభమేళాలో ఎందరో నాగసాధువులు, అఘోరాలు పాల్గొన్నారని, వారు ఎక్కడ ఉంటారో నేటికీ ఎవరికీ తెలియదన్నారు. నిరంతరం శివ నామస్మరణలో ఉండే అఘోరాలకు తెలంగాణ లేడీ అఘోరీకి పోల్చవద్దన్నారు.
పెదాలకు లిప్ స్టిక్స్, తెల్లవారగానే వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ గా మారడమే లక్ష్యంగా లేడీ అఘోరీ పనిగా మార్చుకుందన్నారు. తెలంగాణను బాగు చేయడానికి నేతలు ఉన్నారని, కొత్తగా లేడీ అఘోరీ వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదన్నారు. అఘోరాలు అనే వారు ఎంతో దీక్షతో ఉంటూ, సమాజానికి మేలు చేయడం కోసం పాటుపడుతూ ఉంటారని, వారు లోక కళ్యాణార్థం మాత్రమే తమ జీవితాన్ని సాగిస్తారన్నారు.
Also Read: Minister Kandula Durgesh: సినీ పరిశ్రమ ఏపీకి రావాలి.. సినిమాటోగ్రఫీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీటేక్ యువతిని టార్గెట్ చేసిన లేడీ అఘోరీ, ఏదో చేసి ఆ యువతిని వశపరచుకుందని ఉప్పల్ బాలు ఆరోపించారు. ఎవరిని పడితే వారిని ప్రజలు విశ్వసించే రోజులు లేవని, తాను అఘోరీగా మారితే తనను కూడా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వారిని నమ్మరాదని, నమ్మితే మనకే హాని అంటూ ఉప్పల్ బాలు అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నేను చేయను, నాకెన్ని కష్టాలున్నా ఓకే ఆ ప్రమోషన్స్ చేయనని ప్రకటించిన ఉప్పల్ బాలుకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.