Central Minister on YCP: కూటమి నేతలను నరుకుతానంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. కారుమూరి, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ కారుమూరి తణుకు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తిస్తే ఎలా? నరికేస్తాం, చంపేస్తాం అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తాం. టీడీఆర్ బాండ్ల విషయంలో కారుమూరి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు.
Also Read: UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?
అతి త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది. కారుమూరి నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. నీకు కాళ్లు చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా మేం ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి నేతలకు సంస్కారం లేదు. గత ప్రభుత్వంలో అవినీతికి మారుపేరు కారుమూరి ఎర్రిపప్ప. కూటమి నేతలంతా సమన్వయంతో వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకు సంస్కారం ఉంది, వైసీపీకి సంస్కారం లేదు. కారుమూరి జైలుకెళ్ళి చిప్ప కూడు తినటం ఖాయం. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి. మమల్ని రెచ్చగొడితే కాళ్లు చేతులు నరికేస్తాం. ప్రజలు శిక్ష విధించారు భరించండి’ అని కేంద్ర మంత్రి హితవు పలికారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు