TGPSC(image credit:X)
తెలంగాణ

TGPSC: ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం.. బీఆర్‌ఎస్ నేతకు షాక్!

TGPSC: గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్‌పై ఆరోపణలు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి కమిషన్ అదనపు కార్యదర్శి ఆర్.సుమతి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే న్యాయస్థానం ద్వారా పరువునష్టం దావా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నెల 9న జారీ చేసిన నోటీసుల్లో ఆమె స్పష్టం చేశారు.

కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్, ఫలితాల వెల్లడి విషయంలో రాకేశ్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఇవన్నీ ఆధారరహితమైనవేనని ఆ నోటీసుల్లో అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయబోనంటూ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాకేశ్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అన్ని జవాబు పత్రాలను రీ-వాల్యుయేట్ చేయాలని, ఇప్పటికే జరిగిన తప్పులను సరిదిద్దాలని కమిషన్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో తెలుగు మీడియంలో రాసినవారు దాదాపు 40 % ఉన్నారని, ఒక్కరికి కూడా టాప్ ర్యాంకులు రాలేదని, వీరికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కమిషన్ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 45 కేంద్రాల్లో రెండు కేంద్రాల్లో (18, 19 నెంబర్ల కేంద్రాలు) రాసిన అభ్యర్థుల్లోనే 72 మందికి ట్యాప్‌ ర్యాంక్‌లు వచ్చాయని, అవకతవకలు జరిగాయనే అనుమానం ఉన్నదని, దీనికి కమిషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరు వేల పేపర్లను వాల్యుయేషన్ చేసేందుకు 40 రోజుల సమయం పట్టిందని, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం 20 వేల పేపర్లను తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసిందని, ఇది ఎలా సాధ్యమైందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Also read: Abhishek Sharma: అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఈ సెంచరీ ఆమె కోసమేనా!

ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా, బేషరతుగా రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాల్సిందేనని అదనపు కార్యదర్శి సుమతి ఆ నోటీసుల్లో రాకేశ్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఏ పత్రికలో ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించేలా చొరవ తీసుకున్నారో అదే తరహాలో అంతే ప్రాముఖ్యతతో క్షమాపణ వెలువడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఉండేలా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, సోషల్ మీడియా వేదికగా ఇలాంటి బేస్‌లెస్ వార్తలను పోస్ట్ చేయబోనంటూ హామీ ఇవ్వాలని ఆ నోటీసుల్లో సుమతి స్పష్టం చేశారు. లేనిపక్షంలో కమిషన్ పరువుకు భంగం కలిగించినందుకు పరువునష్టం దావాను న్యాయస్థానాల్లో ఎదుర్కోవాలని, సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసులనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!