vishakha ( Image Source: Twitter)
విశాఖపట్నం

vishakha: ఆహా.. ఇది కదా పోలీస్ అంటే.. వీరు చేసిన పనికి సెల్యూట్!

vishakha: మధ్య కాలంలో చిన్న పిల్లలు తప్పిపోయిన ఘటనలు చాలానే వింటున్నాము. పాప కానీ బాబు కానీ తప్పిపోయినప్పుడు కుటుంబ సభ్యులు పడే బాధ ఎవరూ వర్ణించలేనిది. తర్వాత, సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారుబిడ్డ ఎలా తప్పిపోయిందనే దానిపై వెంటనే దర్యాప్తు చేస్తారు. సాధారణంగా చిన్న పిల్లలు తప్పి పోయినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక శారీరకంగా, మానసికంగా గాయపడ్డారా ? తెలియకుండా ఎవరి ఇంటికైనా వెళ్ళారా ? అనే ఆలోచనలు వస్తుంటాయి. ఇదిలా ఉండగా, తాజాగా విశాఖలోని పెందుర్తిలో పాప తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:  UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?

విశాఖలోని పెందుర్తిలో పాప సాయంత్ర సమయంలో ఆడుకుందామని బయటకివచ్చిన క్రమంలో తప్పిపోయింది. పాప కోసం అన్ని చోట్లా వెదికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. చుట్టూ పక్కల వాళ్ళను కూడా అడిగారు అయిన కూడా పాప జాడ తెలియదు. కుటుంబ సభ్యులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఎవరైనా వాళ్ళ పాపను ఎత్తుకెళ్ళరా ? లేక ఎక్కడైనా తీసుకెళ్లి పడేశారా ? పాప లేకుండా ఎలా జీవించగలం? పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు కనుగొనలేకపోతే పరిస్థితి ఏంటని ఇలా చాలా ఆందోళన పడ్డారు. ఇక, చేసేదేమి లేక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.

Also Read: Deccan Cement: డెక్కన్ సిమెంట్ కబ్జా గుర్తుందా? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్, పర్యావరణవేత్తల ప్రశ్నలు

నిన్న సాయంత్రం 6గంటలకు రెండేళ్ల పాప తప్పిపోయింది. అయితే, రాత్రి ఒంటి గంట సమయంలో పాప ఆచూకీ పోలీస్ సిబ్బంది కనిపెట్టారు. ఓ చెరువు ఒడ్డున అనుమానాస్పద రీతిలో పాప కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. దీని కోసం టెక్నాలజీని కూడా వాడారు. సీసీ కెమెరా, డ్రోన్ సాయంతో పోలీసులు పాపను పట్టుకోగలిగారు. రాత్రి వేళ అయిన లెక్క చేయకుండా చిన్న తుప్పల్లో కూడా పోలీసులు గాలించారు. వాళ్ళు పడిన కష్టానికి పాప కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాపను అప్పగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ