Vijayashanti, Kalyan Ram and NTR
ఎంటర్‌టైన్మెంట్

Vijayashanti: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌.. రామలక్ష్మణుల్లా చూడముచ్చటగా ఉన్నారు

Vijayashanti: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). ఈ చిత్రంలో రాములమ్మ విజయశాంతి (Vijayashanti) పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. టీజర్, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శనివారం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

Also Read- Naresh: సీరియల్ నటితో స్టెప్పులేసిన నరేష్ .. వైరల్ అవుతున్న వీడియో

ఈ కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో తల్లి కొడుకు పాత్రల మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమా చేయమని నా అభిమానులు అడుగుతూ వస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాను కానీ ఇంకా మంచి పాత్ర చేయమని అడిగారు. అలాంటి మంచి పాత్ర ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందా? అని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ ప్రదీప్ వచ్చి ఈ కథ చెప్పారు. చాలా మంచి కథ. అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాను. డైరెక్టర్ విన్నారు. కళ్యాణ్ రామ్‌తో వెళ్లి నేను ఈ సినిమా చేస్తానని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా పని చేసాం.

ప్రతిరోజూ ఒక్కొక్క సీన్ చేస్తుంటే సినిమాపై మాలో ఉత్సాహం, నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫస్ట్ రిపోర్ట్ మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజు చెప్పారు. సెన్సార్ రిపోర్టు కూడా పాజిటివ్‌గా వచ్చింది. ఇద్దరం పోటాపోటీ పడి యాక్ట్ చేసామని చెప్పారు ఇంకో పెద్ద హిట్ కొట్టబోతున్నారని పేపర్స్‌లో వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నామని అంతా ఫిక్స్ అయిపోయాం. తల్లి నిరంతరం తన బిడ్డ కోసం త్యాగం చేస్తూనే ఉంటుంది. ఆరాటపడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్‌లోకి వెళుతుంటాడు. అయినప్పటికీ తన బిడ్డ మంచి మార్గంలోకి వస్తాడని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క మహిళకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం. ఈ సినిమా క్లైమాక్స్ చూసి అంతా షాక్ అవుతారు.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ‘రామా రామా’ స్పెషల్ ఏంటో తెలుసా?

లెజెండ్ నందమూరి రామారావు మహానటుడు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలాంటి లెజెండ్ ఎప్పుడూ మా మనసులో ఉంటారు. ఆయన నుంచి బ్లెస్సింగ్ తీసుకోవడం మా అదృష్టం. జూనియర్ ఎన్టీఆర్‌ని ఇవాళ అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన మంచి నటుడు, మంచి డాన్సర్, మంచి మనిషి. ఈరోజు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎంతో కష్టపడి ఆయన ఆ స్థాయికి వెళ్లారు. అభిమానులు ఇచ్చే ఉత్సాహం మాలో 100 రెట్లు బలాన్ని ఇస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్‌ (Kalyan Ram)లను ఇలా చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు. ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు. మీరు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్ సపోర్ట్ వల్లే ఈ సినిమాలో నేను ఇంకా అద్భుతంగా చేయగలిగాను. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే