Formula e Race Case(image credit;X)
Politics

Formula e Race Case: జైలుకు వెళ్లనున్న కేటీఆర్?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!

Formula e Race Case: కేటీఆర్ అరెస్ట్ ఖాయమని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఫార్ములా ఈ కారు రేసులో తప్పనిసరిగా అరెస్ట్ అవుతారని ఆయన వెల్లడించారు. ఆయన అరెస్ట్ అవుతాననే భయంతోనే హెచ్‌ సీయూ భూముల ఇష్యూపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. హెచ్ సీయూ భూముల వ్యవహారంలో ఏఐ ఫోటోలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.

జింకలు వన్యప్రాణులు జేసీబీ కి అడ్డు వచ్చినట్టు ఫోటోలు వైరల్ చేశారన్నారు. పదేళ్లు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసిన కేటీఆర్ పై సీబీఐ విచారణ జరపాలన్నారు. అవినీతికి కేరాఫ్​ కేసీఆర్ కుటుంబం అన్నారు. బిల్లిరావ్ తో రూ.5 వేల కోట్లతో కేటీఆర్ డీల్ మాట్లాడుకున్నారని ఆరోపించారు.

దమ్ముంటే కేటీఆర్ గత పదేళ్లు అమ్మకాలు చేసిన భూములపై చర్చకు రావాలన్నారు. కరప్షన్ కి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం అని వివరించారు. లిక్కర్ స్కామ్ చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానికి దక్కుతుందన్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్లపై సీబీఐ ఎంక్వైయిరీ జరిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేటీఆర్ గుంటూరు చదువులో ఏం నేర్చుకున్నాడో? ఏమో అని విమర్శించారు.

హెచ్ సీయూ కంచె భూములు ప్రభుత్వానివే అని పీసీసీ చీఫ్​ నొక్కి చెప్పారు. టీజీఐఐసీ కంపెనీతో రూ.10 వేల కోట్లు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఆ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.10 వేల కోట్ల రూపాయలను రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఉపయోగిస్తుందన్నారు. అఫిషియల్ గా ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు రూపాయలు బదిలీ చేయడం జరిగిందన్నారు.

Also read: ITDP Kiran Kumar: వైసీపీ ముఖ్యనేతకు షాక్..14 రోజుల రిమాండ్!

హెచ్ సీయూ భూములను అప్పటి ఎన్టీయే ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయ్ సీఎం చంద్రబాబును కలిసి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి అప్పగించారన్నారు. వైఎస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక వెంటనే రద్దుచేయించామన్నారు. ఇక మంత్రి వర్గంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, సమిష్టి నిర్ణయంగా ముందుకు సాగుతామన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ యూనివర్సిటీల భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. హెచ్‌సీయూకి చెందిన 134 ఎకరాలను కేసీఆర్‌ టీఎన్జీఓలకు ఇచ్చినప్పుడు కేటీఆర్‌కు యూనివర్సిటీల భూమి అని తెలిసిరాలేదా..? అంటూ ప్రశ్నించారు. సన్న బియ్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆయన కాంగ్రెస్ శ్రేణులను కోరారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!