Vishwambhara Poster
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ‘రామా రామా’ స్పెషల్ ఏంటో తెలుసా?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ (Vassishta) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఈ ఏడాది విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పగా.. విక్రమ్, వంశీ, ప్రమోద్‌ తమ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ ప్రారంభించారు. ‘రామా రామా’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా, శ్రీరాముని పట్ల హనుమంతుని ప్రేమ, భక్తిని తెలియజేసేలా ఉంది. (Vishwambhara First Single)

Also Read- Ravi Teja: అన్నయ్య ‘షష్టి పూర్తి’ని అందరూ చూడండి

ఈ పాట ఒక మధురమైన స్త్రీ గొంతుతో ప్రారంభమైంది, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్‌తో ‘జై శ్రీరామ్’ అని ఆలపించడం ఒక గొప్ప భక్తి భావాన్ని కలిగిస్తుంది. శ్రీరామ, సీతా కళ్యాణోత్సవం యొక్క శక్తివంతమైన, వైభవమైన వేడుక నేపథ్యంలో ఈ పాట వైభవోపేతంగా సాగుతుంది. ప్రతి సన్నివేశం కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా భక్తి శ్రద్ధలు నిండి ఉన్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొంటుండగా, శ్రీరాముడు, సీతాదేవి యొక్క సాటిలేని గొప్పతనాన్ని రచయిత అత్యద్భుతంగా ఇందులో పొందుపరిచారు.

ఇంతకు ముందు రాముడిపై మెగాస్టార్ చిరంజీవి ‘అల్లుడా మజాకా’లో ఓ పాట వచ్చింది. ఇప్పటికీ ఆ పాట రాములోరి కళ్యాణ మండపాలలో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ‘రామా రామా’ గీతంతో మెగాస్టార్ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ పాటకు చక్కటి సంగీతాన్ని అందించారు. ఈ పాట స్పెషల్ ఏంటంటే లెజెండరీ గాయకుడు శంకర్ మహదేవన్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాడటం. శంకర్ మహదేవన్, గాయని లిప్సిక తమ గాత్రాలతో ఈ పాటకు ప్రాణం పోశారు. రామజోగయ్య శాస్త్రి కవితాత్మక శైలిలో అందించిన సాహిత్యంలోని ప్రతి పంక్తి.. భక్తి, గౌరవంతో పాటు సాంస్కృతిక గొప్పతనాన్ని మేళవిస్తున్నాయి.

Also Read- Renu Desai: నా రెండో పెళ్లే మీకు ముఖ్యం.. అంతేనా!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మెస్మరైజింగ్ స్టెప్స్‌, ఈ పాటని అప్పుడే ట్రెండింగ్‌లోకి తెచ్చేశాయి. హనుమాన్ జయంతి పర్ఫెక్ట్ సందర్భంగా అనేలా ఈ పాటని మేకర్స్ వదిలి, ఫ్యాన్స్‌కు అలాగే ప్రేక్షకులకు మంచి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం పురాణాలు, భావోద్వేగాలు, అద్భుత దృశ్యాల కలయికతో ఒక గొప్ప కాన్వాస్‌గా రూపొందుతోంది. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘రామా రామా’ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు