Horror Thriller: ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటీటీల్లోనే సినిమాలు చూస్తున్నారు. క్రైమ్, థ్రిల్లర్ , హర్రర్ ను ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. అయితే, ఇప్పుడు సినీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు కొత్త కంటెంట్ తో మరో హారర్ వెబ్ సిరీస్ త్వరలో మన ముందుకు రాబోతుంది.
Also Read: Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?
ఆ సిరీస్ పేరు ఖౌఫ్. అంటే తెలుగులో భయం అని అర్థం. తాజాగా, ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ ను వదిలారు. వచ్చే వారం ఈ సిరీస్ ఓటీటీలో సందడీ చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 18 నుంచి ” ఖౌఫ్ ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దీనిలో రజత్ కపూర్, చమ్ దరంగ్ ముఖ్య పాత్రలలో నటించగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అందర్ని భయపెడుతుంది. ముఖ్యంగా, భారీ ట్విస్టులు.. కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
Also Read: NH 163 G Land Acquisition: ఎన్‌హెచ్ 163జి భూసేకరణపై సమీక్ష.. కలెక్టర్ ప్రావీణ్య కీలక ఆదేశాలు
కథ ఏంటంటే?
ఏ అమ్మాయి అయిన తనకు తానుగా స్వేచ్ఛగా బతకాలని కలలు కంటుంది. అలాంటి అమ్మాయే మాధురి కూడా.. తను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని ఢిల్లీకి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఈ స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీకి వచ్చిన మాధురి తన వద్ద ఉన్న డబ్బుతో మారుమూల హాస్టల్లో ఓ రూమ్ దొరుకుతుంది. అయితే, ఆ హాస్టల్లోకి వెళ్ళగానే అక్కడున్న అమ్మాయిలు మాధురిని చుట్టుముడుతారు. ఆమెకి లేనిపోనివి అన్ని చెప్పి టార్చర్ చేస్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత నువ్వు వెళ్లాలనుకున్న అసలు వెళ్లలేవని, ఈ ప్లేస్ అలాంటిదని చెబుతారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా మాధురి అక్కడే ఉంటుంది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ గదిలో దెయ్యాలు, అతీత శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది. వాటితో ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కొంది? భూత వైద్యుడి సాయంతో ఆమె ఏం కనుక్కుంది ? ఈ సమస్యల నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది ఈ సిరీస్. ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ అవ్వగానే చూసేయండి!