Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదలపై ఇప్పటికీ అనుమానాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు పార్ట్‌లుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాకపోతే, పవన్ కళ్యాణ్ ఇంకా ఒక వారం రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉన్నట్లుగా టాక్ వినబడుతుంది. అందుకే మార్చిలో రావాల్సిన ఈ సినిమాపై మే 9వ తేదీకి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ చేయాల్సిన బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయడానికి, టీమ్ ఎంతగానో వేచి చూస్తుంది. కాకపోతే, పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో.. షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నారు.
ఇప్పుడు కూడా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా, సడెన్‌గా తన కుమారుడికి సింగపూర్‌లో యాక్సిడెంట్ అవడంతో, అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మరింతగా ఈ సినిమాపై విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీరెన్ని అనుమానాలు పెట్టుకున్నా, ఈసారి పక్కాగా ‘హరి హర వీరమల్లు’ థియేటర్లలోకి దిగుతాడని, అధికారికంగా మేకర్స్ మరోసారి బల్లగుద్ది మరీ ప్రకటించారు. చిత్ర విడుదలపై శుక్రవారం మేకర్స్ ఓ అప్డేట్‌ని విడుదల చేశారు. ఈ అప్డేట్‌లో.. సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని తెలుసు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నాం, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నాం.
Also Read- Chiranjeevi: మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తున్నాం. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి చిత్రబృందం సిద్ధమవుతోందని తెలిపారు. దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ గత ఏడు నెలలుగా ఈ సినిమా కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ మొదలుకొని మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయడం వరకు ప్రతి విభాగాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చేయడంలో జ్యోతి కృష్ణ (AM Jyothi Krishna) పాత్ర కీలకం.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవర్ స్టార్ కనువిందు చేయనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో ఇందులో ఆయన కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారని మేకర్స్ అధికారికంగా మరోసారి ప్రకటిస్తూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Manchu Manoj: ‘కన్నప్ప కాదు దొంగప్ప’.. మంచు మనోజ్ ఇలా తగులుకున్నాడేంటి?
మేకర్స్ చెప్పిన ప్రకారం ఈ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తుండగా, మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు