Revanth Reddy
తెలంగాణ

Revanth Reddy: బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం.. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్!

Revanth Reddy: విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ రూపొందించిన చట్టానికి రాజ్యంగ సవరణ చేసేలా పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న ధర్నాకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు కూడా ఈ ధర్నాకు హాజరై మద్దతు తెలపనున్నారు. ఏఐసీసీ నుంచి రాహుల్‌గాంధీ సహా పలువురు హాజరై ఈ డిమాండ్‌ను బలపర్చనున్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు లోక్‌సభల ప్రధాన ప్రతిపక్ష నేతగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఒత్తిడి తీసుకు రానున్నారు.

 ALSO Read: Sama Rammohan:హెచ్ సీయూ రగడ.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సరికొత్త సవాల్!

రాష్ట్రానికి చెందిన పలువురు బీసీ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కూడా ఈ దీక్షకు అటు బీసీ సంఘంతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?