Chiranjeevi on Mark Shankar Health Update
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్

Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) రెండవ కుమారుడు మార్క్ శంకర్, సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హెల్త్ ఎలా ఉందో అంటూ ఇక్కడ అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. మార్క్ శంకర్‌కు జరిగిన సంఘటన గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ (Mark Shankar Health Update) తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్‌తో మెగాభిమానులు, జనసైనికులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ చిరంజీవి ఏం చెప్పారంటే..

Also Read- Pawan Kalyan Son: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ చెబుతూ.. ఎన్టీఆర్‌కు పవన్ కళ్యాణ్ రిప్లై!

‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్) తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- PuriSethupathi: పూరీ-సేతుపతి సినిమాలో స్టార్ నటి.. ఎవరో తెలుసా?

అసలేం జరిగిందంటే.. సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్, అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో (Singapore Fire Incident) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలయ్యారు. చిన్నారి మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లుగా బుధవారం ఒక ఫొటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ ఫొటో చూసిన వారంతా గుండె తరుక్కుపోతుందంటూ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌తో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..