AP Ration Card Holdres: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం, తాజాగా ప్రకటించిన శుభవార్తతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో నూతన రేషన్ కార్డుల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టే ప్రభుత్వం, రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అసలు విషయం తెలుసుకుంటే.. మీరు కూడా హర్షం వ్యక్తం చేయడం గ్యారంటీ.
ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం నిరుపేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తుందని చెప్పవచ్చు, ప్రధానంగా ఇటీవల సామాన్య ప్రజానీకానికి అందించే రేషన్ సరుకులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.
రేషన్ బియ్యంతో పాటు, పప్పు ధాన్యాలను కూడా అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూపుల్లో ఉన్న అర్హులకు, త్వరలోనే నూతన రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దశలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పవచ్చు.
సాధారణంగా ప్రతి రేషన్ కార్డుదారునికి ప్రతినెలా రేషన్ బియ్యం అందిస్తారు. ఈ రేషన్ బియ్యం చాలా వరకు అక్రమ మార్గాన వెళుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిఘా పెంచి అక్రమ రేషన్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టింది.
తాజాగా రేషన్ బియ్యానికి బదులుగా ఎన్నో పోషక విలువలు గల రాగులను కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. జూన్ నుండి రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులుగా రాగులు కావాలన్న వారికి కూడా ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ఏడాదికి దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయని ప్రభుత్వ అంచనా. బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటు ఇతర ధాన్యాలను కూడా పంపిణీ చేసే ప్రభుత్వం, ఇక నుండి రాగులను కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ప్రతినెల 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు సైతం తీసుకునే అవకాశం ఉండడం విశేషం.
Also Read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!
పూర్వపు రోజుల్లో రాగులతో తయారుచేసిన ఆహారానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పోషక విలువలు కలిగిన రాగులు మనిషికి పౌష్టికతను అందిస్తాయని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేషన్ షాపుల నుండి మీరు రాగులు తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే జూన్ వరకు ఆగండి మరి.