Former MLA Shakeel Aamir: పక్కా ప్లాన్ తో బీఆర్ఎస్ నేత అరెస్ట్!
Former MLA Shakeel Aamir (Image Source: AI)
Telangana News

Former MLA Shakeel Aamir: అజ్ఞాతంలో బీఆర్ఎస్ ముఖ్య నేత.. పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు

Former MLA Shakeel Aamir:  విదేశాల్లో తలదాచుకున్న బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel Aamir) ను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన అతడ్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా షకీల్ ను విచారించగా తల్లి అంత్యక్రియలకు వచ్చినట్లు అతడు బదులిచ్చాడు. దీంతో షకీల్ ను తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. అవి పూర్తైన అనంతరం షకీల్ ను అరెస్ట్ చేసే అవకాశముంది.

గతంలో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. కుమారుడు సాహిల్ (Saheel)ను కాపాడేందుకు యత్నించి మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఈ కేసులో నిందితుడిగా మారారు. అతడ్ని ఏ3గా కేసులో చేర్చారు. అప్పటి నుంచి షకీల్ పరారీలో ఉన్నారు. ఏడాదిన్నరగా దుబాయిలోనే ఉంటున్నారు. అయితే తాజాగా అనారోగ్యంతో అతడి తల్లి చనిపోగా.. షకీల్ హైదరాబాద్ కు రాక తప్పలేదు.

అయితే షకీల్ రాకను ముందే గుర్తించిన హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుగానే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దుబాయి నుంచి షకీల్ ల్యాండ్ అవ్వగానే.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నందున అంత్యక్రియల అనంతరం షకీల్ ను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది.

డిసెంబర్ 23,2023 రోజున తెల్లవారుజామున షకీల్ కుమార్ సాహిల్ అతి వేగంగా కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్ లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులు, మియు ముగ్గురు యువతులు ఉన్నారు.ఈ సంఘటనలో బారికేడ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత సాహిల్ అక్కడి నుండి పారిపోయాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సాహిల్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: ITDP Kiran Arrested: చేబ్రోల్ కిరణ్ కు బిగ్ షాక్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఆపై అరెస్టు!

అయితే ప్రమాదం జరిగిన వెంటనే షకీల్ అతని కుమారుడు సాహిల్ ని తప్పించేందుకు అన్ని విదాలా ప్రయత్నించాడని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే సాహిల్ ను దుబాయికి పంపించేందుకు అప్పటి పంజాగుట్ట పోలీప్ స్టేషన్ సిఐ దుర్గారావు సాయం తీసుకున్నట్లు కనుగొన్నారు. దీంతో సదరు సీఐను సస్పెండ్ చేసిన అధికారులు షకీల్ పై కేసు నమోదు చేశారు. ఆపై వెంటనే లుకౌట్ నోటీసులు సైతం జారీ చేయడం గమనార్హం.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య