CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School) ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారికంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. తొలుత పోలీస్ స్కూల్ లోని తరగతి గదులు, ఆట స్థలాన్ని రేవంత్ పరిశీలించారు. స్కూల్లోని విద్యార్థుల (Police School Students) తో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ స్కూల్.. నా బ్రాండ్
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీస్ స్కూల్ గురించి ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని రేవంత్ తెలిపారు. ఎన్టీఆర్ (NT Ramarao) కు కిలో రూ.2 బియ్యం, చంద్రబాబు (CM Chandrababu)కు ఐటీ, వైఎస్ఆర్ (YS Rajasekhar Reddy)ను రైతు బాంధవుడిగా కీర్తిస్తారని చెప్పారు. అయితే ఇవాళ తాను క్రియేట్ చేసిన బ్రాండ్.. యంగ్ ఇండియా అంటూ రేవంత్ స్పష్టం చేశారు. మహాత్ముడి (Mahathma Gandhi) స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సైనిక్ స్కూల్స్ దీటుగా
సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ (Police School Corpus Fund) క్రియేట్ చేసుకోవాలని రేవంత్ అన్నారు. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Read Also: KTR on Fine Rice scheme: నై నై అన్న కేటీఆర్.. సై సై అని చేసి చూపిన సీఎం రేవంత్..
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది తరగతి గదులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని స్ఫష్టం చేశారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఆనంద్ మహేంద్రను ఆ యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ ఆ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని రేవంత్ అన్నారు. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని (Young India Skill University) తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఒలింపిక్స్ లక్ష్యంగా..
వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University), అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Residential Schools) నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు చేసి.. ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.