ITDP Kiran Arrest: ఎట్టకేలకు ఐటీడీపీ కిరణ్ ను అరెస్ట్ చేసేందుకు అంతా సిద్ధమైంది. లైన్ దాటితే ఎవరినైనా వదిలి పెట్టేది లేదని ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ ఘటనను చూసి అంచనా వేయవచ్చు. అయితే ఈ వివాదానికి వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేనా? మరింత తీవ్రతరం చేసేనా అన్నది తేలాల్సి ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టీడీపీని ఇరకాటం పెట్టే రీతిలో కిరణ్ కామెంట్స్ ఉన్నాయన్న వాదన టీడీపీ నేతలే వినిపించారు. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా చేసిన ఈ కామెంట్స్ కాస్త జుగుప్సా కరంగా ఉండడంతో టీడీపీ సీరియస్ అయింది. కూటమి అధికారంలోకి రాగానే, మహిళలను కించపరిస్తే వదిలేదని పలుమార్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు హెచ్చరించారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను ట్రోలింగ్ చేసిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కామెంట్స్ వివాదంగా మారడంతో వైసీపీ సైతం సీరియస్ అయింది. కిరణ్ చేసిన కామెంట్స్ ను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి మరీ కిరణ్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది. హద్దులు దాటితే మనవాడైనా ఒకటే అనే స్టైల్ లో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. విమర్శలు చేయండి కానీ కుటుంబ సభ్యులను కించపరచవద్దు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి కానీ పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే వదిలేది లేదనే తరహాలో టీడీపీ యాక్షన్ మొదలు పెట్టిందని చెప్పవచ్చు.
మొత్తానికి కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్టానం , కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ ప్రాధేయపడుతున్నాడు.
Also Read: TDP on Kiran: ఆ బూతులెందుకు? కార్యకర్తకు టీడీపీ క్లాస్.. ఎట్టకేలకు సారీ అంటూ..
ఇది ఇలా ఉంటే వైసీపీ మాత్రం కిరణ్ చేసిన కామెంట్స్ పై ఇంకా గుర్రుగానే ఉందని చెప్పవచ్చు. కిరణ్.. నిన్ను వదిలేది అంటూ కొందరు వైసీపీకి చెందిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా కిరణ్ కామెంట్స్ టీడీపీ నేతలకే నచ్చలేదని, ఇలాంటి కామెంట్స్ కు అందరూ దూరంగా ఉండాలని అందరికీ హితబోధ చేసినట్లు సమాచారం.
అధికారంలో మనకి నచ్చిన పార్టీ ఉంది కదా స్థాయి మర్చిపోయి మాట్లాడకూడదు కచ్చితంగా ఇతగాడు మాట్లాడిన మాటలు తప్పు, ఆడదాని జోలీకి వచ్చిన వాడు ఎవ్వడు బాగుపడినట్లు చరిత్ర లో లేదు, తప్పుకి క్షమాపణ కోరడమే కాదు మళ్ళీ అలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా ఉండండి. pic.twitter.com/9v8MucJpMK
— Anusha vundavalli (@Anushavundavali) April 9, 2025