CWC meeting: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ప్లీనరీ మీటింగ్లు ముగిశాయి. ఈ నెల 8,9 తేదిల్లో మీటింగ్ లు వరుసగా జరిగాయి. దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మందికి పైనే ఈ మీటింగ్ లకు హాజరైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మీటింగ్ లకు మన స్టేట్ నుంచి యాభై మంది నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహా, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
ఫస్ట్ డే జరిగిన సీడబ్ల్యూ సీ మీటింగ్ లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన ఫాలసీ పై చర్చ జరుగగా, రెండో రోజు జరిగిన ఏఐసీసీ ప్లీనరీ మీటింగ్ లో అన్ని రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ఆయా రాష్ట్రాల పరిస్థితులపై లీడర్లు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పార్టీ పునరుద్ధరణ చేసే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారు.
Also read: Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం.. నెక్ట్స్ అరెస్టా? విచారణా?
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసినప్పుడే దేశంలో పవర్ సాధ్యమవుతుందని ప్లీనరీలోని నేతలంతా ప్రసగించారు. బీజేపీకి చెక్ పెట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో పార్టీ సమన్వయంతో వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నదని తీర్మానించారు. ఇక రాహుల్ ను పీఎంను చేసేందుకు శ్రమించాలని, జోడో యాత్ర తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచి మైలేజ్ వచ్చిందని, త్వరలో మరో యాత్ర కూడా ప్రారంభమవుతుందని ఏఐసీసీ నేతలు ప్రకటించారు.