Ram Charan ( Image Source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: కమెడియన్ సత్య కాళ్ళు మొక్కి దండం పెట్టిన రామ్ చరణ్ .. వైరల్ అవుతున్న వీడియో

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ” గేమ్ ఛేంజర్తో డౌన్ అయిన చెర్రీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పెద్ది చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న మనకీ విషయం తెలిసిందే. రీసెంట్ గా మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో, ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, తాజాగా రామ్ చరణ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో చరణ్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.

యాంకర్ ప్రదీప్ ( Anchor Pradeep )  కొత్తగా నటించినఅక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిరిలీజ్ కి సిద్ధమవుతోంది. చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ కోసం ప్రదీప్, కమెడియన్ సత్య ( Comedian Satya )  కలిసి రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళారు. దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన మూవీ ఏప్రిల్ 11 న థియేటర్లలో సందడీ చేయనుంది. చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచి గ్లోబల్ స్టార్ చరణ్ తో వీడియో చేశారు.

Also Read: Mahabubabad: మానుకోటలో నయా దందా.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు.. అధికారుల అండదండలతో!

యాంకర్ ప్రదీప్, కమెడియన్ సత్య కలిసి రామ్ చరణ్ తో మూవీ ఫస్ట్ టికెట్ కొనేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో విడుదల చేశారు. చరణ్ ని కలిసేందుకు ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య అతని ఇంటికి వెళ్లారు. అక్కడ సత్య చేసిన ఫన్ మాములుగా లేదు. చరణ్ అతని ఫ్రెండ్ అని, తనకి బాగా తెలుసు అని, తను ఏది చెప్పినా అస్సలు కాదనడు అని కామెడీతో అలరించేశాడు. తీరా చరణ్ వచ్చి హాయ్ ప్రదీప్ అనగానే , సత్య ఫేస్ మాడిపోయింది, అసలు తను ఎవరో కూడా తెలియనట్టు కాసేపు నటించాడు.

Also Read: Bhogapuram Airport: ఈ విమానాశ్రయంతో మారనున్న దేశ రూపురేఖలు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

సినిమా టికెట్ కొన్న తర్వాత హాయ్ సత్య నువ్వా అని చరణ్ షాక్ ఇచ్చాడు. అప్పుడు సత్యనాకు అర్థమైంది సార్, మీరు నా నుంచి పద్ధతి కోరుకుంటున్నారుఅని అన్నాడు. రామ్ చరణ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సరదాగా కిందకి వంగి సత్య కాళ్ళు మొక్కాడు.దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న చరణ్, సత్య కాళ్ళు మొక్కి దండం పెట్టడంతోమీరు గ్రేట్ సార్ , మీ సంస్కారం చాలా గొప్పదిఅంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ చరణ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు