TDP on Kiran: రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు కాస్త లైన్ దాటితే, ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తాయి. ఏపీలో ఇప్పుడు అదే జరిగింది. టీడీపీకి చెందిన ఓ కార్యకర్త లైన్ దాటి మరీ, మాజీ సీఎం జగన్ గురించి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇంకేముంది టీడీపీ అధిష్టానమే అతనికి క్లాస్ పీకింది. ఎట్టకేలకు సారీ చెబుతూ వీడియో విడుదల చేశాడు. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియా వేదికగా టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ అనే యువకుడు తన వాయిస్ వినిపిస్తుంటారు. ఏపీ ఎన్నికలకు ముందు వైసీపీపై విమర్శలు చేస్తూ, నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాడు. ఇతని మాటలు కాస్త వెటకారంగా ఉంటాయి కాబట్టి, సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యాడు. వైసీపీపై వెటకారపు విమర్శలు చేయడంలో సీమరాజా తర్వాత మనోడే.
తాను వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తనపై కేసులు నమోదయ్యాయని, తనను చంపేందుకు ప్లాన్ చేశారని గతంలో కిరణ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఏదిఏమైనా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరిచే వారి భరతం పడుతోంది.
ఈ దశలో కిరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్త లైన్ దాటి మరీ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మాజీ సీఎం జగన్ ఫ్యామిలీ గురించి కాస్త కిరణ్ మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న కామెంట్స్ తెరపైకి వచ్చాయి. రాజకీయ విమర్శల వరకు ఓకే గానీ, ఇతర విషయాలను తెరపైకి తీసురావడం, అనవసర కామెంట్స్ చేయడంతో కిరణ్ కు టీడీపీ అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియా కూడా కిరణ్ పై గుర్రుమంది.
టిడిపి తీసుకున్న క్లాస్ కి కిరణ్ ఎట్టకేలకు సారీ చెప్పాడు. హద్దులు దాటి మరీ విమర్శలు చేయరాదని, దయచేసి స్థాయికి మించిన మాటలు మాట్లాడకండి అంటూ టీడీపీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనితో కిరణ్ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఇక రాజకీయ విమర్శలు చేయనని, వైఎస్ జగన్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని, తనను క్షమించాలని కిరణ్ కోరాడు.
Also Read: Pawan Kalyan son: పవన్ వద్దకు అడవి తల్లి.. వీడియో వైరల్..
తాను ఆవేశంతో చేసిన కామెంట్స్ గా పరిగణించాలని, ఇక తనను వదిలి వేయాలని కోరాడు. కానీ వైసీపీ మాత్రం లైన్ దాటి మరీ కిరణ్ విమర్శలు చేశాడని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద టీడీపీ అధిష్టానం ఇలాంటి వాటిని ఒప్పుకొనే ప్రసక్తే లేదని, ఎవరైనా లైన్ దాటి విమర్శలు చేస్తే యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈరోజు జరిగిన దానికి చేబ్రోలు కిరణ్ క్షమాపణ చెప్పాడు ….
దయచేసి మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడకండి…..
🙏🙏🙏 pic.twitter.com/vhbglhFmR7
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) April 9, 2025