JAC Lacchi Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం అని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి [Lacchi Reddy:] అన్నారు. ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించేలా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.హైదరాబాద్ లోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యాలయంలో బుధవారం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై వివిద ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన 37 ప్రధాన సమస్యలపై జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధి బృందం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కె.కేశవరావుకు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే నిర్వహించనున్న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కేకే హమీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు.
Also Read; Telangana : బీజేపీ నేతలకు కొత్త ట్విస్ట్.. కేసులుంటేనే లీడర్స్?
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జీఏడీ (పొలిటికల్) ముఖ్యకార్యదర్శి రఘునంధన్ రావుకు కూడా 37 సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీఏపీయూఎస్ ప్రెసిడింట్ హన్మంత్ రావు, తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ దర్శన్ గౌడ్, టీఈఏ ప్రెసిడెంట్ డా.జి.నిర్మల, టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ పాక, ఎస్జీటీయూ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కత్తి జనార్ధన్ రావు, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగందిని, టీజీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ మహేష్, టీజీ ఎం అండ్ హెచ్ రాబర్ట్ బ్రూస్, రీడిప్లాయిడ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ తో పాటు హెమలత, చంద్రశేఖర్ గౌడ్, కొంగల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు