Tirupati Pakala Katpadi: ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (AP Govt) కేంద్రం (Central Govt) మరో తీపి కబురు అందించింది. ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య డబ్లింగ్ రైల్వే లైన్ (Doublin Railway Line) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్వయంగా ప్రకటించారు. తిరుపతి-పాకాల-కాట్పాడి (Tirupati Pakala Katpadi) మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్ర కేబినేట్ ఆమోదించినట్లు ఆయన స్పష్టం చేశారు.
రూ.1332 కోట్ల ఖర్చుతో..
ఏపీ, తమిళనాడు రాష్ట్రాన్ని కలుపుతూ ఇప్పటికే తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య సింగిల్ రైల్వే లైన్ ఉంది. దీని పొడవు దాదాపు 104 కిలో మీటర్లు (104 KM). అయితే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం ఈ డబ్లింగ్ రైల్వే లైన్ కు అనుమతించింది. దీని ద్వారా తిరుమల, తిరుపతికి కనెక్టివిటీ పెరగడంతో పాటు.. రైల్వేకు వాణిజ్యపరమైన ప్రయోజనాలు సైతం చేకూరనున్నాయి. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు అదనంగా ఆ ప్రాంతాల నుంచి తరలించేందుకు మార్గం సుగమం కానుంది.
Also Read: CM Revanth Reddy: మాకున్న శక్తి.. మీకు లేదా? సీఎం రేవంత్ లాజిక్ ప్రశ్న
14లక్షల మందితో కనెక్టివిటీ
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య నిర్మించబోయే డబ్లింగ్ లైన్.. దాదాపు 400 గ్రామాల గుండా ప్రయాణించనుంది. ఇది దాదాపు 14 లక్షల జనాభాకు ఈ రైల్వే లైన్ కనెక్టివిటీ కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ దాదాపు 35 లక్షల పనిదినాలు సృష్టిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాదు ఆయా మార్గాల్లో రద్దీని సైతం ఈ ప్రాజెక్ట్ తగ్గిస్తుందని అన్నారు. బొగ్గు, వ్యవసాయ సామాగ్రి, సిమెంట్, ఖనిజాల తరలింపును తిరుపతి-పాకాల-కాట్పాడి మార్గం డబ్లింగ్ లైన్ మరింత సులభతరం చేయనుంది.