Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) రెండవ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళగా, మంగళవారం అక్కడ సంభవించిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలయ్యారు. చిన్నారి మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పవన్ కళ్యాన్ తనయుడు (Pawan Kalyan Son) మార్క్ శంకర్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఫొటో చూస్తే నిజంగానే గుండె తరుక్కుపోతుంది.
Also Read- Sudigali Sudheer: హిందూ దేవుళ్లపై తమాషాలా? సుధీర్ స్కిట్‌పై రచ్చ రచ్చ!
చిన్న వయసు, తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని చిన్నారులు. తెలుసుకున్నా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియని పిల్లలు. అలాంటి సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడటం అంటే.. మరో జన్మ ఎత్తినట్లే భావించాలి. అక్కడికి ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక ప్రాణం పోయిందంటే.. దీనిని చిన్న సంఘటనగా తీసేయలేం. చాలా భారీగా ఏర్పడిన అగ్నిప్రమాదం ఇది. ప్రస్తుతం బయటికి వచ్చిన మార్క్ శంకర్ ఫొటో (Mark Shankar Photo in Hospital) చూస్తే.. నిజంగా అక్కడి ప్రమాదం ఏ స్థాయిలో సంభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఫొటోలో మార్క్ శంకర్ ఇంకా భయాందోళనలోనే ఉన్నాడు. బిక్కు బిక్కు మంటూ చూస్తున్న ఆ చూపుల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆక్సిజన్ మాస్క్‌తో మార్క్ శంకర్‌ని ఈ ఫొటోలో గమనించవచ్చు. చేతులను గమనిస్తే.. వేడికి బొబ్బలు వచ్చినట్లుగా తెలుస్తుంది. నిజంగా ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడటం అంటే వారి తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమనే చెప్పుకోవాలి. అడగకుండానే దానాలు చేసే పవన్ కళ్యాణ్ దాన గుణం ఇక్కడ అడ్డుపడి, తన కుమారుడిని కాపాడిందనేలా ఈ ఫొటోని చూసి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
Also Read- Jr NTR: పవనన్నా.. కాస్త ధైర్యంగా ఉండన్నా!
ఇక తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసినా, పవన్ కళ్యాణ్ తన కర్తవ్యాన్ని నిర్వహించి మాత్రమే తన కుమారుడి కోసం వెళ్లారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. పవన్ కళ్యాన్ తన రెండవ కుమారుడికి తన అన్నయ్య చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ కలిసి వచ్చేలా మార్క్ శంకర్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ తమ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావడంతో అందరూ ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. ఈ విషయం పలు సందర్భాలు తెలియజేశాయి కూడా. చిరంజీవి ఒడిలో మార్క్ శంకర్ ఉన్న ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు