Jr NTR on Pawan Kalyan Son Mark Shankar
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: పవనన్నా.. కాస్త ధైర్యంగా ఉండన్నా!

Jr NTR: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ (Mark Shankar) సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళగా, మంగళవారం అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌ కాళ్లకు, చేతులకు గాయాలవడమే కాకుండా, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేసినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ పిల్లాడికి డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన సమయంలో పవన్ కళ్యాణ్ అరకు ప్రాంతంలో పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రి తన అన్నావదినలు చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లారు.

Also Read- NTRNeel: ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కూడా వెంటనే స్పందించారు. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ అవసరమైన సహకారం అందించవలసిందిగా స్థానిక హై-కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి వారంతా ఈ ఘటనపై స్పందిస్తూ.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరితో పాటు ప్రముఖులెందరో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మార్క్ శంకర్ క్షేమాన్ని అభిలాషించారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండు లిటిల్‌ వారియర్. పవన్‌ కళ్యాణ్, ఆయన కుటుంబసభ్యులంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్‌కు జనసైనికులు, మెగాభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని ఎన్టీఆర్‌ని కొనియాడుతున్నారు. ఇక సింగపూర్ ప్రయాణానికి ముందు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా పెద్ద కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజున దురదృష్టవశాత్తు నా చిన్న కుమారుడికి గాయాలు అవడం బాధాకరం. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మాట్లాడి మార్క్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే సింగపూర్‌లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్‌కి ఆదేశాలిచ్చారు. ప్రధానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read- Breaking News: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు ఇప్పుడెలా ఉందంటే..

ఇంకా ఆయన మాట్లాడుతూ..నేను అరకులో ఉండగా సీఎం నారా చంద్రబాబు (CM Nara Chandrababu Naidu) ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరం అయిన సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్ శంకర్ బాగుండాలని అభిలషించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, కింజారపు అచ్చన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సహచర సినీ నటులు, సినీ ప్రముఖులు తమ ఆకాంక్ష వ్యక్తం చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నేతలు, శ్రేణులు మార్క్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు