TG Summer Holidays: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కూళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించే సమయం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 23 నుంచి సమ్మర్ హాలీడేస్ (Summer Holidays 2025) ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ (Telangana Education Department).. తన అకాడమిక్ క్యాలెండర్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వార్త.. హల్ చల్ చేస్తోంది. ఈసారి సమ్మర్ హాలీడేస్ కాస్త ముందుగానే రావొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఎన్నిరోజుల ముందంటే?
తెలంగాణ విద్యార్థులను (Telangana Students).. ఈసారి వేసవి సెలవులు ముందుగానే పలకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్ 23 నుంచి సమ్మర్ హాలీడేస్ ఇవ్వాల్సి ఉండగా.. దానికి 3 రోజుల ముందే సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20 నుంచి స్కూళ్లకు విరామం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే విద్యార్థులకు పండగే అని చెప్పవచ్చు.
కారణం ఏంటంటే!
ఇటీవల రాష్ట్రంలో ఆకాల వర్షాలు దంచి కొట్టిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఎండ తీవ్రత కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థుల గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే వేసవి సెలవులు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ అధికారులు.. ముందస్తు వేసవి సెలవులపై త్వరలో అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read: YCP On SI Sudhakar: ఎస్సై సుధాకర్ యాదవ్ పై వైసీపీ రివేంజ్.. వెలుగులోకి సంచలన నిజాలు!
ఒక పూటే స్కూల్
ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటిపూట బళ్లు నడుస్తున్నాయి. మార్చి 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల మధ్య పాఠశాలలు పనిచేస్తున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒంటిపూట బడులను సైతం తెలంగాణ విద్యాశాఖ ముందే తీసుకొచ్చింది. కాగా జూన్ 11 లేదా జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. 2025-26 విద్యాసంవత్సరం జూన్ నుంచి మెుదలు కానుంది.