Pawan Kalyan and Mark Shankar
ఎంటర్‌టైన్మెంట్

Breaking News: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు ఇప్పుడెలా ఉందంటే..

Breaking News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar)‌.. సింగపూర్‌లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu), ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఇలా అందరూ ఆ పిల్లాడు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ.. మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై మంచి మనసుతో అందరూ చేస్తున్న ఈ ప్రయత్నాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.

Also Read- Akhil6: మా నాయన నాకో మాట చెప్పినాడు.. అఖిల్ ఈసారి మాస్ అవతార్‌లో!

ఆ మీడియా సమావేశం అనంతరం అన్నయ్య చిరంజీవి (Chiranjeevi), వదినమ్మ సురేఖ (Surekha)లతో కలిసి పవన్ కళ్యాణ్ మంగళవారం అర్ధరాత్రి సింగపూర్ వెళ్లారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, అన్నా లెజినోవాకి భరోసాని, ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇంటి పెద్దగా చిరంజీవి, సురేఖలు కూడా సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్‌కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యంపై అధికారిక సమాచారాన్ని పవన్ కళ్యాణ్ టీమ్ విడుదల చేసింది. (Mark Shankar Health Update)

Also Read- Manchu War: ‘మంచు వార్’ మళ్లీ షురూ.. ఇంటి వద్ద మనోజ్ బైఠాయింపు.. జల్ పల్లిలో హై అలెర్ట్!

మార్క్ శంకర్ హెల్త్‌కు సంబంధించి తాజా అప్డేట్ ఏమిటంటే.. ప్రస్తుతం అతనికి సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖలు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్‌ను చూశారు. చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి మార్క్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని డాక్టర్లు తెలిపినట్లుగా సమాచారం. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్‌కు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.

అసలేం జరిగిందంటే.. సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్– అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలయ్యారు. చిన్నారి మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు